Crime కల్లకుచ్చి జిల్లా వీరచోళ పురంలో మూడు దశాబ్దాల క్రితం చోరీకి గురైన ఆరు విగ్రహాల ఆచూకీ కనుగొన్నారు.. దాదాపు 30 సంవత్సరాల క్రితం చోరికి గురైన ప్రాచీన విగ్రహాలను విగ్రహాల అక్రమ రవాణా నిరోధక విభాగం పోలీసు అధికారులు కనుగొన్నారు..
వీరచోళ పురంలో మూడు ఆలయాల్లో త్రిపురాంతకం, ప్రతిపురుసుందరి, నారీశ్వర ఆలయాల్లో కొన్ని కోట్లు విలువచేసే ఆరు విగ్రహాలను ముప్పై ఏళ్ల క్రితం దొంగలించారు. ఇందులో నటరాజస్వామి, వీణసుందరి, దక్షిణామూర్తి, పావైనార్చియార్ సమేత సుందర్, త్రిపురాంతకం, త్రిపుర సుందరి విగ్రహాలు ఉన్నాయి. అయితే ఈ విగ్రహాలు కనిపించటం లేదంటూ అప్పట్లో ఇచ్చిన కంప్లైంట్ ను పోలీసులు పట్టించుకోలేదని.. పెద్ద రచ్చ జరిగింది..
ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ.. 2018లో ఓ న్యాయవాది హైకోర్టును ఆశ్రమించారు. ఈ మేరకు విగ్రహాల ఆచూకీ కనుగొనాలని ఆదేశించింది హైకోర్టు. తాజాగా పిటీషన్ వేసిన వారికి ఊరట కలిగించింది. విగ్రహాల అక్రమ రవాణా నిరోధక విభాగం డీజీపీ జయంత్ మురళి, ఐజి దినకర్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం దేశ విదేశాల్లో ఎన్నో ఏళ్లుగా చోరీకి గురైన విగ్రహాల ఫోటోలను పంపించి దర్యాప్తు ముమ్మరం చేసింది.. ఇందులో ఆరు విగ్రహాలు అమెరికాలోని ఓ మ్యూజియంలో ఉన్నట్టు తేలటంతో యునెస్కో ఒప్పందం మీదకు భారతదేశానికి తీసుకురానున్నారు… అయితే ఈ విషయంపై వీర చొలపురం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. విగ్రహాలు తిరిగి తమ గ్రామానికి రావటం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.