Crime దేశంలో రానురాను ఆన్‌లైన్ మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. వివిధ రూపాల్లో అమాయకుల ఖాతాల నుంచి వేలకు వేలు కొట్టేస్తున్నారు… నేరగాళ్లు. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలోనే కోల్‌కతాకు చెందిన అమీర్‌ఖాన్ నివాసాలపై బ్యాంకు అధికారులతో కలిసి ఈడీ అధికారుల బృందం దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో సుమారు రూ. 7 కోట్ల నగదు, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది.
వ్యాపారి నివాసంలో ఈడీ దాడుల నేపథ్యంలో కేంద్ర బలగాలను పటిష్టంగా మోహరించారు. ఈ-నగ్గేట్స్ అనే మొబైల్ గేమింగ్ యాప్‌తో వినియోగదారులను మోసం చేస్తున్నారన్న ఫెడరల్ బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అధికారులు… తాజా దాడులు నిర్వహించారు.
నిందితుడు అమీర్‌ఖాన్ నిర్వహిస్తున్న మోబైల్ గేమింగ్ యాప్… మొదట్లో వినియోగదారులకు మంచి కమిషన్ వాలెట్‌లు అందిస్తుంది. ఆ తర్వాత వారి నుంచి ఎక్కువ కొనుగోళ్లు జరిపించి.. ఉన్నట్టుండి వారి వాలెట్‌లోని డబ్బు అంతా మాయం చేస్తుంటారు. ఆ వెంటనే అకస్మాత్తగా యూప్ పనిచేయడం మానేస్తుంది. ఈలోగా అందులో ఉన్న మన డేటా మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. అప్పుడికి గానీ వినియోగదారుడి మోసపోయినట్లు గ్రహించలేడు అని ఈడీ వివరించింది. అందుకే విపరీతంగా టెక్నాలజీ పెరిగిపోతుంది ఈ రోజుల్లో ఆన్లైన్ మోసాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కేటుగాళ్లు ఏ రూపంలో దాడులకు దిగుతున్నారు తెలియటం లేదు. మనకు సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ను ఎవరికీ షేర్ చేయరాదు. ఓటిపీలను చెప్పటం.. అనవసరమైన లింకులను ఓపెన్ చేయటం వంటివి ఎటువంటి పరిస్థితుల్లో చేయరాదు.