Entertainment బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటోలు ఇంటర్నెట్లో ఎంత హల్చల్ చేసాయో తెలిసింది.. ఓ పేపర్ మ్యాగజైన్ కోసం ఆయన చేసిన న్యూడ్ ఫొటో షూట్ వైరల్ గా మారింది. దీంతో తీవ్ర విమర్శలు పాలయ్యాడు ఈ హీరో. ఈ ఫోటోలను రణ్‌వీర్ స్వయంగా తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో మరింత దుమారం రేగింది. అతనితో పాటు అతని భార్య దీపికా పడుకొనేని కూడా ట్రోల్ చేశారు నెటిజన్స్. మహిళల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఈ ఫొటోలు ఉన్నాయంటూ ఓ ఎన్జీవో సంస్థ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై రణ్‌వీర్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది.
అయితే ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న తన న్యూడ్ ఫోటోలో ఒకటి తనది కాదని రణవీర్ చెప్పినట్టు తెలుస్తుంది. ఆ ఫోటోను మార్ఫింగ్ చేశారని.. ఆ ఫోటోలో ఉన్నది తను కాదని వాంగ్మూలంలో తెలిపారు. అయితే ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు ఆ ఫొటోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలుస్తుంది. ఈ రిపోర్ట్ ను బట్టి అది మార్ఫింగ్ చేయబడిందా..? లేదా..? అని నిర్ధారణకి వస్తారని సమాచారం.
ఒకవేళ ఈ రిపోర్ట్ లో ఫొటోను మార్ఫింగ్ చేశారని తేలితే.. ఈ కేసులో రణవీర్ సింగ్ క్లీన్ చిట్ పొందే అవకాశం ఉంది. ఎందుకంటే రణ్‌వీర్ సింగ్‌పై ఈ ఒక్క ఫొటోపైనే కేసు నమోదైంది. తాను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఏడు చిత్రాలు అశ్లీలంగా లేవని రణ్‌వీర్ సింగ్ తెలిపారని తెలుస్తుంది. అయితే జూలై 26న రణ్‌వీర్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఆగస్టు 29న ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు.






















