Crime పులివెందుల: మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ బాబాయి… వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చాన్నాళ్లు తర్వాత సీబీఐ మరోసారి విచారణ ప్రారంభించింది. వివేకా హత్య కేసులో కీలక వ్యక్తిగా అనుమానిస్తున్న వివేకా వ్యక్తిగత కార్యదర్శి ఇనయతుల్లాను ప్రశ్నించింది. దాదాపు ఆరు నెలల సూదీర్ఘ విరామం తర్వాత… కడప నుంచి పులివెందులకు చేరుకున్న సీబీఐ…. కేసును ఛేదించేందుకు కావాల్సిన సాక్ష్యాధారాలు సేకరించే పనిలో పడింది. పులివెందులలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఇనయతుల్లాను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. వివేకా హత్య కేసు విచారణకు ఏపీలో కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని… ఈ కేసు విచారణను హైదరాబాద్‌కు బదిలీ చేయాలని కోరుతూ… వివేకా కుమార్తె సునీత సుప్రీంలో పిటిషన్ వేసింది. దీనిపై నిన్న విచారణ జరిపిన సుప్రీం… ఈ కేసులో సాక్షులు, సీబీఐ అధికారులకు వస్తున్న బెదిరింపులపై అక్టోబరు 14లోగా సమాధానం ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, సీబీఐకు నోటీసులు జారీ చేసింది. దాంతో పాటే… తదుపరి విచారణను ఆక్టోబర్ 14కు వాయిదా వేసింది.
హత్యకు ముందు ఇనయతుల్లా… వివేకాకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసేవాడు. ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గానూ పని చేసేవాడు. 2019 మార్చి 19న వివేకా హత్య జరిగినప్పుడు…తొలుత ఇంట్లోకి వెళ్లి రక్తపు మడుగులో ఉన్న మృతదేహాం ఫొటోలు, వీడియోలు తీశాడని చెబుతున్నారు. ఇతని ఫోన్ ద్వారానే ఇతరులకు ఫొటోలు షేర్ చేశారనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణలు. ఈ నేపథ్యంలో ఆ ఫొటోలు ఎవరెవరికి పంపారు.?… ఫొటోలు తీసేటప్పుడు ఎవరెవరు ఉన్నారు? తదితర వివరాలపై ఆరా తీసినట్టు తెలుస్తోంది.