Bhakthi అందరూ ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్నా దీపావళి పండుగ రానే వచ్చేసింది అందరికీ సంపద శ్రేయస్సు కలిగించే ఆ లక్ష్మీదేవిని వినాయకుడిని పూజించే ఈ పండుగ ఎంతో ప్రత్యేకమైనది అయితే ఈ పూజ కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అంతేకాకుండా కచ్చితంగా పూజామండపంలో ఉంచాల్సిన మరొక వస్తువును గురించి తెలుసుకుందాం…
హిందూ సంప్రదాయం అంటేనే పండుగలు.. ఇందులో ముఖ్యంగా కొన్ని పండుగలు అంటే ఇంటికి కలతొస్తాయని చెప్పాలి అందులో దీపావళి అంటే మరింత ప్రత్యేక కష్టాలు అన్ని తొలగిపోయి ఇంటిల్లిపాది సుఖంగా ఉండాలని సిరిసంపదలు కలగాలని సాక్షాతలక్ష్మి దేవిని పూజించే దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఆమె పళ్లెంలో కచ్చితంగా గోమతి చక్రాన్ని ఉంచాలని చెబుతున్నాయి పురాణాలు..
అలాగే ఆ పళ్లెంలో గోమతి చక్రాన్ని ఉంచాక ఆ చక్రానికి తప్పనిసరిగా పూజ జరిపించాలి. అలాగే ఆ సమయంలో లక్ష్మీదేవిని వినాయకుడిని కుబేర యంత్రాలను కూడా పూజించాలి… అలాగే లక్ష్మీదేవిని పూజించిన అనంతరం దీపారాధన చేయడం మంచిదని చెబుతున్నారు ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఉన్న కలహాలు అన్ని తీరిపోయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని తెలుస్తోంది అలాగే వీలైతే ఈ రోజున శంఖానాదం కూడా చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల ఎలాంటి దరిద్రులు అయినా తొలగిపోతాయని మన పురాణాలు వివరిస్తున్నాయి..