Crime ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ప్రముఖ ఈ కామర్ సంస్థ అమెజాన్ కు చెందిన పార్సిల్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది చిత్తూరు జిల్లా కుప్పంలో ఉన్న పార్సిల్ గోడౌన్ లో ఈ అగ్ని ప్రమాదం జరగగా ఎంతో విలువైన సామన్లు అగ్నిపాలు అయినట్టు సమాచారం..
చిత్తూరు జిల్లా అమెజాన్ పార్సిల్గూడంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం 10 లక్షల వరకు నష్టాన్ని కలిగించిందని సమాచారం రాత్రి సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల మంటలు వ్యాపించాయి అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు అయితే అప్పటికే చాలా సామాన్లు కాలిపోయాయి ఈ ప్రమాదంలో సుమారు పది లక్షల వరకు విలువైన సామాన్లు అగ్నికాహతి అయినట్టు సమాచారం.. అయితే దీపావళి కానీ బుక్ చేసుకున్న చాలా సామాన్లు ఇప్పటికే డెలివరీ చేసేసామని స్టాక్ చివరికి వచ్చేసిన తర్వాత ఈ ప్రమాదం జరగటం వల్ల నష్టం తక్కువగానే జరిగిందని అక్కడ సిబ్బంది తెలిపారు.. అలాగే ప్రమాదం జరిగే సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదని తెలుసుకొని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.. అలాగే ఇప్పుడు ఎవరైతే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నారు వారికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ ముందుగా ఎవరైతే డబ్బులు పే చేసి ఉంటారు వాళ్లకి కొంత సమయం తర్వాత ఆ వస్తువులు డెలివరీ అవుతాయి అయితే అమెజాన్ కు మాత్రం ఇది కొంతవరకు నష్టం కలిగించే విషయమే చెప్పాలి..