రంగస్థలం సినిమాతో క్రేజీ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్నారు సుకుమార్- రామ్ చరణ్. ఈ కాంబోలో మరో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఫ్యాన్స్ కోరిక నెరవేరింది. త్వరలో ఈ కాంబోలో మరో సినిమా ప్రేక్షకులముందుకు వస్తుందని తెలిపారు ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్.
ఇటీవల ఓ ఇంటర్వూలో పాల్గొన్న సాబు సిరిల్ రామ్ చరణ్ కొత్త ప్రాజెక్ట్ కోసం ఆసక్తి కర విషయాలు పంచుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో హీరో పరిచయ సన్నివేశాలు కూడా చిత్రీకరించారట. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్‌కు ముందే ఈ షూటింగ్ ప్రారంభమైందట. ఆర్ఆర్ఆర్ సినిమాలో చెర్రీ లుక్ నచ్చి సుకుమార్ అదే లుక్ తన సినిమాలో ఉండాలని కోరాడట. అందుకే అప్పుడే హీరో పరిచయం సీన్స్ పూర్తి చేసేశారు. అయితే ఈ విషయం తెలిసి నెటిజన్లు ఇదెక్కిడి ట్విస్ట్ మావ.. అని నోరెళ్లబెడుతున్నారు. చరణ్ తదుపరి ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్‌తో ఉంటుందా అని ఆలోచిస్తున్నామని ఇంతలో షూటింగ్ కూడా ప్రారంభించి షాకిచ్చారని అభిమానులు ట్వీట్‌లు వేస్తున్నారు. అంతేకాకుండా రాజమౌళి కూడా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో సుకుమార్, చెర్రీ గురించి మాట్లాడారు. అప్పుడు కూడా మనం అర్థం చేసుకోలేకపోయాం అని అంటున్నారు.