rudram kota movie title launched by actor dr mohan babu,actress jayalaitha,anil kandavally,vibheesha,latest telugu movies,telugu golden tv,my mix entertainments,teluguworldnow.com,director kona ramu.

‘రుద్రం కోట’ టైటిల్ ను లాంచ్ చేసిన డైలాగ్ కింగ్ మోహన్ బాబు

సీనియర్ నటి జయలలిత మొట్టమొదటి సారి ఎ ఆర్ కె విజువల్స్ బ్యానర్ పై సమరిపిస్తున్న చిత్రం ‘రుద్రం కోట’. ఈ నూతన చిత్ర టైటిల్ ను డైలాగ్ కింగ్ మోహన్ బాబు చేతుల మీదుగా విడుదల చేయించారు చిత్ర యూనిట్.. ఈ కార్యక్రమానికి హాజరయిన మంచు మోహన్ బాబు టైటిల్ ను విడుదల చేసి టీమ్ కు అభినందనలు తెలియచేస్తూ.. చాలా రోజులయ్యింది ఆడియో ఫంక్షన్ లకు హాజరయ్యి.. జయలలిత చాలా మంచి అమ్మాయి.. నాకు రౌడీ గారి పెళ్ళాం చిత్రం నుంచీ నాకు ఆమె పరిచయం అప్పటి నుంచి తనంటే నాకు చాలా గౌరవం, ప్రేమ, అభిమానం అలాంటి తను ఈ రోజు మొదటి సారిగా ఒక చిత్రాన్ని సర్పిస్తోంది అని తెలిసి నా వంతు సపోర్ట్ ను అందించాలని పిలవగానే వచ్చాను.. ఎవరైనా చిన్న సినిమా తోనే మొదలుపెట్టి ఎంతో పెద్ద స్థాయి వరకు వెళ్తారు.. నిర్మాతగా నేను కూడా చిన్న సినిమా తోనే మొదలు పెట్టాను.. ఇప్పుడు ఆ సాయి బాబా ఆశీస్సులతో మీ అందరి ప్రోత్సాహంతో ఈ స్థాయిలో ఉన్నాను.. ఈ సినిమాలో అందరూ కొత్త వారే అని తెలిసింది.. ఏం పరవాలేదు ఇప్పుడు కొత్తే కానీ తరువాత పాతదే…ఈ చిత్ర నిర్మాత అనిల్ చాలా మంచి స్థాయికి వెళ్లాలని, అలానే దర్శకుడు కోన రాము పెద్ద డైరెక్టర్ అయ్యి నాకు కూడా తన సినిమాలో అవకాశం ఇవ్వాలని, అలానే ఆ సాయి నాథుని ఆశీస్సులు మీకు మీ చిత్రానికి ఉండాలని కోరుకుంటున్నాను.. మేము తిరుపతిలో ఆ తిరుమలేషుని దర్శించడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తిరుపతిలోని సాయి బాబా దేవాలయానికి కూడా వచ్చి వెళ్లేంత పెద్ద దేవాలయాన్ని నిర్మించనున్నాము అన్నారు..

జయలలిత మాట్లాడుతూ… ‘రుద్రం కోట’ చాలా మంచి కథ అందుకే మొదటి సారి అటెంప్ట్ చేస్తున్నాను.. హీరో అనిల్ రుద్రంగా, నేను కోటమ్మగా నటిస్తున్నాము, ఈ ఊరు ఖమ్మం డిస్ట్రిక్ట్ లో పోలవరం చుట్టుపక్కల ఉండేది ఇప్పుడది పోలవరం ప్రాజెక్ట్ లో పోయింది.. అక్కడే షూటింగ్ జరుపుకున్నాము.. ఇందులో నటించిన ప్రతి పాత్రకీ ప్రాధాన్యత ఉంది.. ఇందులో 5 పాటలుంటాయి అన్నారు..

ఇంకా ఈ కార్యక్రమంలో హీరో నిర్మాత అనిల్ కొండవల్లి, దర్శకుడు కోన రాము, హీరోయిన్ విభీష, రైటర్ వెంకట్ బాబు తదితరులు పాల్గొన్నారు..

సీనియర్ నటి జయలలిత ప్రధాన పాత్రలో పోషిస్తూ సమర్పిస్తున్న ‘రుద్రం కోట’ చిత్రానికి హీరో మరియు నిర్మాత అనిల్ కండవల్లి, హీరోయిన్: విభీష,ఇతర నటీనటులు భాస్కర్, రియా, శివ, శంకర్ మాస్టర్ తదితరులు. డైలాగ్స్: రంగ, మ్యూజిక్: సుభాష్, ఫైట్స్: జాషువా, కొరియోగ్రాఫర్: స్వర్గీయ శివశంకర్ మాస్టర్, సుచిత్ర చంద్రబోస్, లిరిక్స్: సాగర్, ఎడిటింగ్: ఆవుల వెంకటేష్, కథ-దర్శకత్వం: కోన రాము.

rudram kota movie title launched by actor dr mohan babu,actress jayalaitha,anil kandavally,vibheesha,latest telugu movies,telugu golden tv,my mix entertainments,teluguworldnow.com,director kona ramu.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *