Crime మహారాష్ట్ర జిల్లా పాల్ఘాట్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.. ఎలక్ట్రిక్ స్కూటర్కు చార్జింగ్ పెట్టి నిద్రపోగా ఆ స్కూటర్ ఇంటిలోనే పేలింది ఈ ప్రమాదంలో ఏడేళ్ల చిన్నారి మరణించాడు..
పెట్రోల్ నాదా చేస్తాయని కారణంతో చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకుంటున్నారు. అయితే వీటివల్ల కొన్నిసార్లు పెను ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఓ సంఘటనే మహారాష్ట్ర జిల్లా పాల్గాట్లో చోటుచేసుకుంది. గత నెల 22 తేదీ రాత్రి పడుకునే సమయంలో స్కూటర్కు చార్జింగ్ పెట్టి నిద్రపోవుగా అది తెల్లవారుజామున 4:30 సమయంలో పేలిపోయింది.. ఏడేళ్ల బాలుడు అన్సారి, వాళ్ళ నాన్నమ్మ పక్కనే నిద్రపోతుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే స్కూటర్ పెరగడంతో ఆ బాలుడు దాదాపు 70 శాతం కాలిపోయాడు.. పక్కనే ఉన్న అన్సారీ నాయనమ్మ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన చుట్టూ ఉన్నవాళ్లంతా అన్సారీని వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.. అయితే ప్రాణాలతో పోరాడుతున్న ఆ పసివాడు ఈరోజు తుది శ్వాస విడిచాడు..
అయితే ఫాల్టీ బ్యాటరీ కారణంగానే ఈవీ స్కూటర్ పేలిపోయిందని.. స్కూటర్ తయారీలో లోపాలు ఉండటం వల్లనే ఇంత పెను ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇలాంటి సంఘటనలు దేశమంతా జరుగుతూనే ఉన్నాయి.. ఎలక్ట్రిక్ స్కూటర్లు పేలి చాలామంది చనిపోతున్నారు..