Accident : అల్లూరి జిల్లా లోని చింతూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లా లోని చింతూరు మండలం, బొడ్డుగూడెం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో వ్యాన్, లారీ ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. కాగా ఈ విషాదకర ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా… ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా స్థానికుల సాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటినా ఆస్పత్రిలో చేర్చి చికిత్సనందించారు. వ్యాన్ లో ఉన్నవారంతా భద్రాచలం లోని శ్రీరామ చంద్రస్వామని దర్శించుకొని చత్తీస్ ఘడ్‌కు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలిసింది.
వ్యాన్ డ్రైవర్ అతివేగంగా వాహనాన్ని నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బాధితులు ప్రయాణిస్తున్న వాహనంలో ఉన్న మరి కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు ఛత్తీస్‌గఢ్ వాసులుగా గుర్తించారు.
ప్రమాదానికి అతివేగమే కారణమని భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ విషయంలో మృతుల వివరాలు, తదితర పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వార్తతో వన్ లో మిగిలిన వారంతా తమ బంధువుల కోసం తీవ్రంగా విలపిస్తున్నారు.