సికింద్రాబాద్ లో వీవ్స్ అండ్ క్రాప్ట్స్ హ్యాండ్ లూమ్ వస్త్ర ప్రదర్శన షరూ !
హైదరాబాద్, జూన్ 2023 : భారతీయ సంస్కృతి లో సిల్క్, హ్యాండ్ లూమ్ వస్త్రో ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని టాలీవుడ్ నటి ప్రియాంక చౌదరి అన్నారు. సికింద్రాబాద్ జవహర్ నగర్ కాలనీ లోని సింధీకాలనీ రోడ్డు లో గల ఆర్య వైశ్య అభ్యుదయ సంఘం హాలులో ఏర్పాటైన కృతి వీవ్స్ అండ్ క్రాప్ట్స్ హ్యాండ్ లూమ్ వస్త్ర ప్రదర్శన ప్రియాంక చౌదరి శుక్రవారం నాడు ప్రారంభించారు. ప్రదర్శనలో కొలువుదీరిన చేనేత కారులు వస్త్రోత్పత్తులు తిలకిస్తూ, వాటి తయారీ గురించి ఆమె తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ… చేనేత వస్త్రా లపై నేటికి ఆదరణ తగ్గలెదని, నేటి తరం యువతలో కూడా హ్యాండ్ లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారన్నారు.
నిర్వాహకులు యలమంచిలి శ్రీలతా మాట్లాడుతూ… ఈ నెల 25వ తేది వరకు కొనసాగుతున్న ప్రదర్శన లో దేశం లోని 14 నగరాల నుండి చేనేత కారులు , చేతి పని బృందాలు తమ సిల్క్ హ్యాండ్ లూమ్ చీరలు, డ్రెస్ మెటిరియల్ వంటి 50 వేల రకాల వస్త్రో ఉత్పత్తులను అందుబాటులొ ఉంచారని వివరించారు. మరిన్ని వివరాల కోసం ఆంపిల్ రీచ్ పి.ఆర్ + 91 95429 76567 సంప్రదించగలరు.