Crime News : సోషల్ మీడియా రాజకీయం మంచి గుర్తింపు పొందింది సోనాలి ఫోగట్. గత సోమవారం గుండె పోటుతో మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె మరణం అనుమానస్పదంగా ఉందని కుటుంబ సభ్యులు మీడియాతో వెల్లడించారు. సోనాలి మరణం గురించి సి.బి.ఐ దర్యాప్తు చేయాలనీ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.సోనాలి చనిపోవడానికి ముందు అక్కడి పరిస్థితులపై ఫోన్ కాల్ ద్వారా అనుమానాన్ని వ్యక్తపరిచింది అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.
సోనాలి ఫోగట్ గోవా టూర్‌లో ఉండగా గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అయితే సోనాలి సోదరి రమణ్ ఆమె ఫిట్‌గా ఉంటుంది. చనిపోవడానికి ముందు ఆమె నాతో మా అమ్మతోనూ ఫోన్ చేసి మాట్లాడింది.అయితే ఇక్కడేదో జరుగుతోందని ఎందుకు అనుమానాస్పదంగా ఉందని, నార్మల్ కాల్ కాకుండా.. వాట్సాప్ కాల్‌లో మాట్లాడదాం అని చెప్పింది. తిరిగి ఫోన్ చేయలేదు అని చెప్పింది. దీనిపై గోవా పోలీసులు మాత్రం పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇంకా రానందునా అసహజ మరణం కిందే కేసు నమోదు చేశారు.
సోనాలి చెల్లెలు ఈ కేసులు హర్యానా ప్రభుత్వానికి అప్పగించాలని గోవా ప్రభుత్వాన్ని కొరకు జరిగింది. అయితే గోవా పోలీస్ చీఫ్ జస్‌పాల్ సింగ్ మాత్రం ఈ మరణంలో ఎలాంటి అనుమానాలు లేదని పోస్ట్‌మార్టం వచ్చిన తర్వాత తరువాతే ఏ విషయం అన్నది నిర్ధారిస్తుంది అని తెలిపారు. అయితే ఈమె పలువురు కాంగ్రెస్ నాయకులతో మంతనాలు జరిపినట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. నిజానిజాలు ఏమైనాప్పటికీ గోవా ప్రభుత్వం లేదా హర్యానా ప్రభుత్వం ఈ కేసు పై దర్యాప్తు ప్రారంబించింది ఈ కేసు పై దర్యాప్తు ప్రారంభించనున్నది.