Actress Sri Divya Launched Hero Sunil Movie Kanabadutaledu Teaser, Vaishali Raj, Latest Telugu Movies, Film News, Telugu World Now,
FILM NEWS: సునిల్ హీరోగా `కనబడుటలేదు` టీజర్ లాంచ్ చేసిన హీరోయిన్ శ్రీదివ్య.
తెలుగు నటి శ్రీదివ్య సస్పెన్స్ అండ్ లవ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న `కనబడుటలేదు` టీజర్‌ని విడుదల చేశారు. ‘కనబడుటలేదు’ టీజర్ సినిమాలోని అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ సాగింది. ఈ కథ నగరంలో వరుస హత్యల చుట్టూ తిరుగుతుందని టీజర్‌ని బట్టి చూస్తే అర్ధమవుతుంది. ‘పోలీసులు పెద్ద విషయాన్ని మాత్రమే పెద్దగా చూస్తారు.. కాని డిటెక్టివ్ చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూడాలి’ అంటూ ఆ వరుస హత్యల కేసుని సాల్వ్ చేయడానికి ప్రయత్నించే డిటెక్టివ్ గా సునిల్‌ను పాత్రను పరిచయం చేశారు.
సిటీలో జరిగే హత్యలకు మాస్క్ ధరించి ఉన్న ఓ అజ్ఞాతవ్యక్తి కారణం అనే విధంగా టీజర్ లో చూపించారు. అతను ఎవరు? అతని ఉద్దేశ్యం ఏమిటి? అసలు ఎవరు కనబడటం లేదు? అనే ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
‘కనబడుటలేదు’ టీజర్ సస్పెన్స్ గా మరియు ఇంట్రెస్టింగ్ గా ఉంది. దర్శకుడు బలరాజు. ఎం కథను వివరించడానికి ఒక విలక్షణమైన మార్గాన్ని ఎంచుకున్నాడని టీజర్ తో తెలుస్తోంది. మధు పొన్నాస్ అందించిన నేపథ్య సంగీతం, సందీప్ బద్దుల సినిమాటోగ్రఫీ, రవితేజ కుర్మాన ఎడిటింగ్ ఆకట్టునేలా ఉన్నాయి
సుక్రాంత్ వీరెల్ల ప్రధాన పాత్రలో నటిస్తుండగా వైశాలిరాజ్, హిమజ, యుగ్రం, శశిత కోన, నీలిమ పతకంశెట్టి, సౌమ్య శెట్టి, C/o కంచరపాలెం’ ఫేమ్ రాజు, ఉమా మహేశ్వర రావు, కిషోర్, శ్యామ్ మరియు మధు తదితరులు నటిస్తోన్న ఈ చిత్రాన్ని సరయు తలసిల సమర్పణలో ఎస్.ఎస్ ఫిల్మ్స్, శ్రీ పాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం త్వరలో స్పార్క్ ఓటిటి ద్వారా విడుదలకానుంది.
తారాగణం: సునిల్, సుక్రాంత్ వీరెల్ల, వైశాలిరాజ్, హిమజ, యుగ్రం, శశిత కోన, నీలిమ పతకంశెట్టి, సౌమ్య శెట్టి, C/o కంచరపాలెం’ ఫేమ్ రాజు, ఉమా మహేశ్వర రావు, కిషోర్, శ్యామ్ మరియు మధు
సాంకేతిక వర్గం:
రచన,దర్శకత్వం: బాలరాజు ఎం.
బ్యానర్స్: ఎస్.ఎస్ ఫిల్మ్స్, శ్రీ పాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్
సమర్పణ: సరయు తలసిల
సంగీతం: మధు పొన్నాస్
డిఒపి: సందీప్ బద్దుల
ఎడిటింగ్: రవితేజ కుర్మాన
పిఆర్ఓ: వంశీ – శేఖర్.