Movie కొన్ని సినిమాలపై ముందు నుంచి మంచి హైప్ ఉంటుంది.. అలాంటి మూవీనే అధర్వ. యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం.. ముందు నుంచి మంచి హైప్ క్రియేట్ చేసింది. తాజాగా ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన మూవీ టీం.. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకుంటుంది.
అయితే ఏ సినిమాకైనా షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సినిమాపై హైప్ క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. కానీ ఈ విషయంలో అధర్వ టీం ముందుంది తమ సినిమాను తాము ప్రమోట్ చేసుకోవడంలో ఎక్కడ తగ్గేదే లేదంటూ ముందుకెళ్లిపోతుంది. ఇప్పటికే విడుదలైన సినిమా టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది.. ఇందులో ‘నేను నమ్మిన సత్యం.. వెతికే లక్ష్యం.. దొరకాల్సిన సాక్ష్యం.. చేదించే వరకు ఈ కేసును వదిలిపెట్టను సార్..’ అనే డైలాగ్ ఆడియన్స్ లో విపరీతమైన హైప్ ను క్రియేట్ చేశాయి.. ప్రస్తుతం విడుదలైన ఫస్ట్ లుక్ లో హీరోని చూసిన వారంతా సినిమాపై మరింత హోప్స్ పెట్టుకుంటున్నారు… ఇందులో హీరో సుత్తి పట్టుకొని అదిరిపోయే స్టైల్ లో నిల్చున్నాడు.
క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు, మేజర్ లాంటి సక్సెస్ ఫుల్ మూవీస్ కు సంగీతాన్ని సమకూర్చిన శ్రీచరణ్ పాకాల దీనికి సంగీతం స్వరకూరుస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రాబోతున్న ఈ చిత్రాన్ని నూతలపాటి నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్నాయి. ది సీకర్ ఆఫ్ ది ట్రూత్ అనే టైటిల్ తో ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.