Health సహజ సిద్ధంగా లభించే పదార్థాల్లో తేనె ఒకటి. ప్రకృతి మనకు అందించిన అద్భుత వరం తేనె.. ఇటు ఆరోగ్యం ఇవ్వటంలేనూ అందంలోనూ ప్రముఖ పాత్ర వహిస్తుంది.. ఇటువంటి తేనెను రోజు తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..
తేనెను రోజు పరగడుపున గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును కరిగిస్తుంది.. తేనె రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మకాయలలో సి విటమిన్ ఎక్కువగా ఉన్నందు వల్ల, తేనెను నిమ్మకాయతో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, గొంతు నొప్పి సమస్య తరచూ వేధిస్తుంటే చిన్న అల్లం ముక్కను తేనెలో ముంచి నమిలితే ఉపశమనం ఉంటుంది… తేనెలో వుండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు గాయాలను నయం చేస్తాయి.
తేనె చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాలిన గాయాలు మొటిమలు వంటి మచ్చలు శరీరంపై ఉండి పోయినప్పుడు వాటిపై నేరుగా తినను రాసి కాసేపు వదిలేస్తే మచ్చలు అవే మాయమైపోతాయి.. గోరు వెచ్చని పాలలో కలుపుకొని తాగితే చక్కటి నిద్ర పడుతుంది.. అయితే తేనె పరిస్థితుల్లోనూ నేరుగా తలకు తగిలించరాదు. ఇలా చేస్తే తెల్ల వెంట్రుకలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఎటువంటి వేడి పదార్థాల్లోనూ తీయని జోడించడం కానీ, వేడి చేయటం కానీ చేయరాదు. అలాగే నెలల పిల్లలకి తేనెను తినిపించరాదు.. అలా తినిపిస్తే వాళ్లకి కొన్ని డిసీజ్ లు వచ్చే అవకాశం ఉంది..