పాట చిత్రీకరణ జరుపుకుంటోన్న అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి. ‘బంగార్రాజు’
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న బంగార్రాజు సినిమా షూటింగ్ పూర్తి కావొస్తుంది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో నాగ చైతన్య, కృతి శెట్టిలపై పాటను చిత్రీకరించనున్నారు. నేటితో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది.
ఇదే విషయాన్ని నాగార్జున ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. చివరి రోజు షూటింగ్.. మరో పెప్పీ మాస్ సాంగ్ రెడీ అవుతోంది.. పండగ లాంటి సినిమా.. బంగార్రాజు త్వరలోనే రాబోతోంది అని ట్వీట్ వేశారు. దీంతో పాటు నాగార్జున ఓ ఫోటోను షేర్ చేశారు. అందులో చిన్న బంగార్రాజుగా పంచెకట్టులో నాగ చైతన్య మెరిశారు. ఇక కృతి శెట్టి హాట్ లుక్‌లో అదిరిపోయారు.
అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా మనం. అందులో నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న ఈ ‘బంగార్రాజు’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్ జరుగుతోంది.
నటీనటులు : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ
సాంకేతిక బృందం :
కథ, దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ
నిర్మాత : అక్కినేని నాగార్జున
బ్యానర్స్ : జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి.
స్క్రీన్ ప్లే : సత్యానంద్
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫర్ : యువరాజ్
ఆర్ట్ డైరెక్టర్ : బ్రహ్మ కడలి
పీఆర్వో : వంశీ-శేఖర్