Movie News:గ్రీకువీరుడు అక్కినేని నాగార్జున ఈ ఏడాదిలో విడుదల చేసిన బంగారు రాజు 2 ఊహించినంత విజయం అందుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత నాగార్జున ఇంతవరకు ఏ చిత్రాన్ని విడుదల చేయలేదు. అయితే పోలీస్ గెటప్ లో ప్రేక్షకులు అలరించేందుకు సర్వ సిద్ధం చేస్తున్నారు ఈ గ్రీకువీరుడు. అయితే నాగార్జున తాజా చిత్రం గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కెరలు కొడుతున్నాయి.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ది ఘోస్ట్’లో నాగార్జున సోనాల్ చౌహాన్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారని సమాచారం.ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేస్తున్నట్లు యూనిట్ బృందం తెలియజేశారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఆగస్టు 25న విడుదల చేయనున్నారు.
లవర్ బాయ్ గా కనిపించే నాగార్జున ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సినిమాగా ది ఘోస్ట్ సినిమా ప్రేక్షకుల అలరించనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు పెంచాయి. ఈ సినిమాలో కొరకు యాక్షన్ సన్నివేశాల కొరకు సోనాల్ చౌహాన్ శరీర ఆకృతి కొరకు చాలా కష్టపడి నటించడం విశేషం. ఈ చిత్రంలో నాగార్జునలు చాలా డిఫరెంట్ గా ఉంటుందని ప్రేక్షకులకు విచిత్రం బాగా నచ్చుతుందని నిర్మాతలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6 నాగార్జున హోస్ట్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 6 వచ్చే నెల 4వ తేదీ నుండి ప్రారంభం కానుంది.
Excited to show you #TheGhost trailer on Aug 25 th!! 🔥🔥🔥 https://t.co/pOfrkN6IB7
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 21, 2022