Movie News :టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ పెద్దగా సోషల్ మీడియా వార్తలు కనిపించరు నాగార్జున. అయితే తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో దగ్గర నుండి నాగార్జున పేరు సోషల్ మీడియాలో మోగుతున్న విషయం అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ రియాల్టీ షో కు గత మూడు సంవత్సరాల నుండి హొస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా బిగ్ బాస్ 6 ఇంకొక ఎనిమిది రోజుల్లో ప్రేక్షకులను అలరించేందుకు సర్వం సిద్ధమైంది. ఇదిలా ఉంటే తాజాగా ద గోస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసింది యూనిట్ బృందం.
కాగా ఈ ట్రైలర్ లో నాగార్జున ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా రఫ్ఫాడించాడు. ఓ తల్లీకూతుళ్లను కాపాడేందుకు ఎంతోమంది విలన్లను నేలమట్టం చేశాడు. అయితే ఇందులో నాగార్జున చెప్పిన డైలాగులు మాత్రం ఒక రేంజ్ లో ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ చిత్రం అక్కినేని నాగార్జునకు సూపర్ హిట్ ఇచ్చేలా ఉందనే చెప్పుకోవాలి.
ఈ చిత్రానికి భరత్- సౌరభ్‌అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఒక రేంజ్ లో ఉందని చెప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 5న విడుదల కానుంది. అలానే హిందీలో బ్రహ్మాస్త్ర చిత్రంలో విలన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ లో మరిన్ని సినీ అవకాశాలు అందుకుంటారేమో కింగ్ నాగార్జున. చూడాలి మరి ఈ ఏడాది నాగార్జున హవా ఎలా కొనసాగుతుందో.