బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఆలియా- రణ్‌బీర్ తల్లిదండ్రులయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఆలియా ముంబయిలోని ఓ హాస్పిటల్‌లో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆలియా- రణ్‌బీర్ సోషల్ మీడియా పంచుకున్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఈ గుడ్‌న్యూస్ తెలియడంతో కపూర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా హాస్పిటల్‌కు చేరుకుంటున్నారు.
మరోవైపు ఆలియా- రణ్‌బీర్ జంటకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 14న ఒక్కటైన ఈ జంట పెళ్లైన 2 నెలలకే ఆలియా ప్రెగ్నెంట్ అని పంచుకున్నారు.