Entertainment బాలీవుడ్ నటి అలియా భట్.. అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఈ ముద్దుగుమ్మకు కేవలం ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అభిమానులు ఉన్నారు. అంతేకాదు, విదేశాల్లో కూడా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. అయితే తాజాగా మరో గుడ్న్యూస్ చెప్పింది ఆలియా. త్వరలో తాను జపాన్ భాషలో సినిమా చేయనున్నానని తెలిపింది.
ఇప్పటికే అలియా బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ఇతర భాషల్లోనూ సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే తెలుగులోనూ ఆమె ఎంట్రీ ఇచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమాతో టాలీవుడ్ లోనూ అభిమానుల్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ సినిమాతో హాలీవుడ్ లోనూ అడుగుపెట్టబోతోంది అలియా.
ఇటీవల అలియా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేవలం ఒక్క బాలీవుడ్ లోనే కాదని, విదేశీ భాషల్లో కూడా నటించాలని ఉందని తన మనసులోని మాటను బయట పెట్టింది అలియా. ఈ సందర్భంగా జపాన్ సినీ పరిశ్రమలో ఎంట్రీ గురించి కూడా హింట్ ఇచ్చింది. తాను ఏ సినిమాలో నటించినా.. తనని తాను ఇంప్రూవ్ చేసుకోడానికి ప్రయత్నిస్తుంటానని తెలిపింది. ఛాలెంజింగ్ తో కూడిన పాత్రలు చేయడం తనకు ఇష్టమని చెప్పింది. అందుకే ఎప్పుడూ కొత్త తరహా పాత్రలు చేయడానికి, కొత్త పరిశ్రమలో పనిచేయడానికి ప్రయత్నిస్తానని పేర్కొంది. ఎలా మాట్లాడాలో తెలిస్తే.. జపనీస్ సినిమాల్లో కూడా నటిస్తానని చెప్పుకొచ్చింది.