NTR:గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటిస్తున్న ‘దేవర’ మూవీకి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒక్కో అప్‌డేట్ వింటున్న అభిమానులు సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇదే క్రమంలో ‘దేవర’ మూవీ క్లైమాక్స్ గురించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ (Devara Climax Update) ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అది ఏంటంటే..
RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటిస్తున్న చిత్రం ‘దేవర’. దర్శకుడు కొరటాల శివ (Koratala Shiva) ఈ చిత్రానికి పవర్‌ఫుల్ కథ సిద్ధం చేయగా.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఇప్పటికే నాలుగు షెడ్యూళ్లు కంప్లీట్ చేసుకుంది. అంతేకాదు జులై 3 నుంచి నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఇక పాన్ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం ‘దేవర’ మేకర్స్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కెమెరా (ALEXALF, ARRI Signature ప్రైమ్ లెన్స్) వాడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒక్కో అప్‌డేట్ మూవీపై అంచనాలు పెంచుతుండగా.. ప్రత్యేకించి ఈ మూవీ రెండు పార్ట్స్‌గా (Devara Two Parts) తెరకెక్కనుందని రూమర్స్ వినిపిస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు లీక్స్ అందుతున్నాయి. ఆయన గతంలో ‘అదుర్స్, ఆంధ్రావాలా, నా అల్లుడు’ చిత్రాల్లో డ్యూయల్ రోల్‌లో నటించారు. ఇదిలా ఉంటే.. దేవర క్లైమాక్స్‌లో ‘పార్ట్ 2’కు సంబంధించిన లీడ్ ఉంటుందని, కొరటాల శివ అందుకు తగ్గట్లుగా స్టోరీ డిజైన్ చేశారని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. స్క్రిప్ట్ కోసమే ఆర్నెళ్లు శ్రమించిన శివ.. ప్రీప్రొడక్షన్ కోసం మరో ఆరు నెలలు వెచ్చించి పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగారు.