Sitara Ghattamaneni : మహేష్ బాబు గారాల పట్టి అయిన సితార గురించి తెలియని వారు వుండరు ,అయితే ఈమె గురించి ఒక కొత్త న్యూస్ వెలుగులోకి వచ్చింది . నిజానికి టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్కువుగా కమర్షియల్ యాడ్స్ చేస్తూ, పలు సంస్థలకు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తాడని అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు మహేష్ కూతురు కూడా బ్రాండ్ అంబాసడర్ గా మారిపోయింది. సితార.. సినిమా ఎంట్రీ ఇవ్వకుండానే ఎంతో ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ లో డాన్స్ వీడియోలు చేస్తూ అందర్నీ ఆకర్షిస్తుంది.
అలాగే మహేష్ బాబుతో కలిసి ఇప్పటికే పలు సీరియల్ ప్రమోషన్స్ లో కనిపించి అలరించింది. ఇక ఇప్పుడు సింగిల్ గా తానే ఒక కమర్షియల్ యాడ్ చేస్తూ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రముఖ జువెలరీ బ్రాండ్ కి అంబాసడర్ గా వ్యవహరించబోతుంది. ఈ బ్రాండ్ కి యాడ్ షూటింగ్ ని ఇటీవలే పూర్తి చేసారు . అందుకు సంబంధించిన షూటింగ్ సెట్ లోని వీడియోని సితార తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. త్వరలోనే ఆ యాడ్ కూడా ప్రసారం కానుంది. ఇక ఒక సినిమా కూడా చేయకుండానే సితార ఒక బ్రాండ్ కాంట్రాక్ట్ అందుకోవడంతో మహేష్ అభిమానులు సితారని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
కాగా మహేష్ నటిస్తున్న SSMB28 మూవీ నుంచి చిత్ర యూనిట్ తాజాగా అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ టైటిల్ ని ఈ నెల 31న రిలీజ్ చేయబోతున్నారు. ఆ రోజున కృష్ణ సూపర్ హిట్ మూవీ మోసగాళ్లకు మోసగాడు సినిమా రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాతో పాటు బిగ్ స్క్రీన్ పై SSMB28 టైటిల్ ని అనౌన్స్ చేయబోతున్నారు.