Allu Arha : అల్లు అర్జున్ కూతురు అర్హ గురించి అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్, ఆయన భార్య అల్లు స్నేహ రెడ్డి కూడా అర్హకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. శాకుంతలం సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇవ్వనుంది ఈ చిన్నారి. స్టార్ హీరోయిన్ సమంత లీడ్ క్యారెక్టర్ లో నటిస్తూ… గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా శాకుంతలం.
ఈ సినిమాలో శకుంతల తనయుడు భరత రాజు చిన్నప్పటి క్యారెక్టర్ లో అర్హ నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ట్రైలర్, ఓ సాంగ్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో అర్హ సింహంపై కూర్చొని రావడంతో.. సినిమాపై ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. తాజాగా అర్హ ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఫోటోని స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోని అల్లు అర్జున తన స్టోరీలో కూడా షేర్ చేసి తన కూతురు డబ్బింగ్ చెప్తుందని మురిసిపోతున్నాడు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు బన్నీ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
శాకుంతలం సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేస్తుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. మరో పక్క ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇక శాకుంతలం సినిమాని ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. అనారోగ్యంతో ఉండి కూడా సమంత ఈసినిమాకు డబ్బింగ్ చెప్పింది. ఆ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.