సినిమా స్టార్లకు ఆయా సినిమాల్లో నటిస్తే వచ్చే డబ్బులే కాదు.. ఇతరత్రా ఆదాయం కూడా ఎక్కువే ఉంటుంది. ముఖ్యంగా వివిధ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంతోమంది హీరోలు పనిచేస్తుంటారు. ప్రజల్లో క్రేజ్‌ఉన్న హీరోలతో ఒక్క యాడ్ చేస్తే ఆయా కంపెనీల ఆదాయం ఎన్నో రెట్లు పెరుగుతుంది. అందుకే యాడ్‌లకు అంత డిమాండ్ ఉంటుంది. ఒక్కో యాడ్‌కు కనీసం రూ.20 కోట్ల వరకు తీసుకునే హీరోలూ ఉన్నారు.
అయితే అన్ని యాడ్‌లూ ఆదాయం తెచ్చిపెట్టేవే అయినా.. ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా ఉండేవి అయితే హీరోలకు కాస్త ఇబ్బందే. డబ్బు కోసం చూసుకుంటే కొన్నిసార్లు పరువు ప్రతిష్ఠలు దెబ్బతింటాయి. అందుకే ఎన్ని కోట్లు ఇస్తామన్నా.. కొన్ని యాడ్లకు మాత్రం హీరోలు ఓకే చెప్పరు. లేటెస్ట్‌గా అలాంటిదే జరిగింది.
తమ యాడ్‌లో కేవలం గంటపాటు నటిస్తే రూ.10 కోట్లు ఇస్తామని స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌కు ఓ సంస్థ బంపర్ ఆఫర్ ఇచ్చింది. కానీ బన్నీ ఆ ప్రకటనలో నటించడానికి ఇష్టపడలేదు. తనను ఎంతగానో అభిమానించే ఫ్యాన్స్‌కు దానివల్ల నష్టం జరుగుతుందని భావించి యాడ్‌లో నటించేందుకు ఒప్పుకోలేదు.
ఓ పొగాకు సంస్థ తమ యాడ్ కోసం కేవలం గంటపాటు కెమెరా ముందుకు వస్తే రూ.10 కోట్లు ఇస్తామని బన్నీకి చెప్పింది. అలాంటి ప్రకటనల్లో నటిస్తే ఫ్యాన్స్ కూడా తనని చూసి పొగాకు ఉత్పత్తులకు అలవాటు అవుతారని, అందుకే తాను ఆ ప్రకటన చేయను అని రిజక్ట్ చేసేశాడు బన్నీ.అభిమానులకోసం ఆలోచించి బన్నీ తీసుకున్న నిర్ణయానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన టాపిక్ వైరల్ అవుతోంది.