Allu Arjun:టాలీవుడ్ స్టైలిష్ స్టార్.. పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ అమ్మాయిని ఉద్దేశించి చెప్పిన ఓ మాట ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసా!.. అది కూడా అమ్మాయిని ఉద్దేశించి అనే వివరాల్లోకి వెళితే..తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా వారు నిర్వహించిన పాటల కార్యక్రమం ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’. ఈ ప్రోగ్రామ్ ఫైనల్స్ ముగిసింది. ఈ ఫినాలేకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. బన్నీ ఇచ్చిన ఎనర్జీ, ప్రోగ్రామ్‌కి వచ్చిన అభిమానుల ప్రోత్సాహం అన్నీ కలసి తెలుగు ఇండియన్ ఐడల్ 2 సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. అయితే ఈ ప్రోగ్రామ్‌లో ఓ హైలైట్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పటమే.
మరి ఇంతకీ అల్లు అర్జున్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరేమిటో తెలుసా!.. శ్రుతి. తెలుగు ఇండియన్ ఐడల్ 2 ఫినాలేకి ఐదుగురు సింగర్స్ ఎంపికయ్యారు. తెలుగు ఇండియన్ ఐడల్ 2కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గొప్ప స్పందన వచ్చింది. ఎంతో మంది ప్రతిభ ఉన్న సింగర్స్ 10000 మందికి పైగానే ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. అందులో నుంచి 12 మంది టైటిల్ గెలుచుకోవటానికి పోటీ పడ్డారు. కొన్ని వారాల పాటు ఈ సింగర్స్ మధ్య గొప్ప పోటీ నెలకొంది. చివరగా 5 మంది.. న్యూ జెర్సీ నుంచి శ్రుతి, హైదరాబాద్ నుంచి జయరాం, సిద్ధిపేట నుంచి లాస్య ప్రియ, హైదరాబాద్ నుంచి కార్తికే, విశాఖపట్నం నుంచి సౌజన్య భాగవతులు .. వీరిలో న్యూజెర్సీకి చెందిన శ్రుతి పాట పాడిన తర్వాత నీ పేరు నాకెప్పుడూ స్పెషలే. ఎందుకంటే నా ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ పేరు కూడా శ్రుతినే అనే చెప్పటం కొస మెరుపు.
ఇక తెలుగు ఇండియన్ ఐడల్ 2 ఫినాలేలో విషయానికి వస్తే.. పాల్గొన్న ఐదుగురు సింగర్స్‌లో విశాఖపట్నంకు చెందిన సౌజన్య భాగవతుల విజేతగా నిలిచింది.