ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు ప్రతిష్టాత్మక చిత్రం ‘అల్లూరి’. ఈ చిత్రంతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసి గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు. అల్లూరి సినిమాకి పని చేసిన నటీనటులు సాంకేతిక నిపుణులందరికీ నా బెస్ట్ విశేష్. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న హీరోయిన్ కయ్యదు లోహర్ కి ఆల్ ది బెస్ట్. అలాగే ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న ప్రదీప్ వర్మకి నా బెస్ట్ విశేష్. బెక్కెం వేణుగోపాల్ గారి ప్రేమ ఇష్క్ కాదల్ నుండి హుషారు వరకూ ప్రతి సినిమాని ఫాలో అవుతుంటాను. ఆయన మరిన్ని మంచి సినిమాలు తీసి తెలుసు సినిమా స్థాయిని పెంచాలి. శ్రీవిష్ణు నాకు ఇష్టమైన వ్యక్తి. విష్ణు సినిమాలన్నీ ఫాలో అవుతుంటాను.
https://youtube.com/shorts/TTLkGXdR1PE
ఆయన మొదటి సినిమా ప్రేమ ఇష్క్ కాదల్. అందులో ముగ్గురు హీరోలు వుంటారు. అయితే తనకున్న పరిధిలోనే అద్భుతంగా నటించి అందరినీ ఆకర్షించారు. అప్పటినుండి శ్రీవిష్ణుపై ప్రత్యేకమైన ఇష్టం. ఆయన్ని పిలిచి మాట్లాడా. ఆయన చేసిన ప్రతి సినిమా ఫాలో అవుతుంటాను. విష్ణు గారికి మంచి అభిరుచి వుంది. ఆయన చేసే సినిమాల్లో కొత్తదనం వుంటుంది. సినిమా కోసం చాలా అంకిత భావంతో పని చేసే హీరో శ్రీవిష్ణు. అందుకే ఆయన అంటే నాకు ఇష్టం, గౌరవం. ఆయన ప్రతి సినిమా విజయం సాధించి, ఇంకా మంచి స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. అల్లూరి సినిమా సెప్టెంబర్ 23న థియేటర్లోకి వస్తుంది. మీరందరూ చూసి దీవించాలని కోరుకుంటున్నాను. విష్ణు మంచి సినిమాలు ఇస్తూనే వుంటారు.
https://youtube.com/shorts/nm5vHxHiz8w
ప్రస్తుతం నేను పుష్ప 2 పనుల్లో కాస్త బిజీగా వున్నాను. ఈ సమయంలో విష్ణు వచ్చి ఈ వేడుకకు రమ్మని కోరారు. ఆయన ఎప్పుడూ ఏమీ అడగలేదు. ఫస్ట్ టైం ఇలా అడిగేసరికి మరో ఆలోచన లేకుండా ఈ ఈవెంట్ కి రావాలని ఫిక్స్ అయిపోయా. నా మనసుకు నచ్చే వ్యక్తి విష్ణు. ఇంకా మంచి మంచి సినిమాలు చేసి మరింత పైకి రావాలని కోరుకుంటున్నాను. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మంచి కంటెంట్ వున్న చిత్రాలని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. అల్లూరి సినిమా మంచి కంటెంట్ తో వస్తోంది. సెప్టెంబర్ 23న అందరూ థియేటర్ లో చూసి దీవించాలి” అని కోరారు.