Entertainment బుల్లితెర యాంకర్ నటి అనసూయ తన అందాలతో కుర్రకారును పిచ్చెక్కిస్తుంది.. తన అందాలతో అమెరికాను మరింత అందంగా తయారు చేస్తుంది.. కుటుంబ సమేతంగా అమెరికాకు వెళ్లిన అనసూయ తన హాట్ అందాలతో అలరిస్తూ ఆ విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుంది..
అందగత్తె నువ్వు ఏం చేస్తావ్ అంటే.. నా అందాలతో తుఫాన్‌ను తరిమికొడతా, చలికి గజ గజ వణుకుతున్న అమెరికాకు అందాలతో వెచ్చదనాన్ని ఇస్తా అంటుంది. ఆ గ్లామర్ బ్యూటీ ఎవరో కాదు నటి అనసూయ. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ వివాదస్పద ట్వీట్లతో వార్తల్లో నిలుస్తుంటుంది.
ప్రస్తుతం ఈ అమ్మడు అమెరికాలో ఎంజాయ్ చేస్తోంది. అక్కడ ఓ షాపింగ్ మాల్ ముందు నిలబడి పోజులిచ్చింది. ఒక పక్క హరికేన్ ఇయాన్ తుఫాన్ అమెరికాని కుదిపేస్తుంటే.. అనసూయ అక్కడ రచ్చ రచ్చ చేస్తుంది. అనసూయ రాకతో దెబ్బకు తుఫాన్ పోయిందని అక్కడి వారు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారట. అంతేకాకుండా అమెరికాకు భలే వెచ్చదనాన్ని ఇస్తుంది.. అసలే తుఫాన్ ప్రభావంతో చలికి గజగజ వణికిపోతుంటే.. మా తల్లే సూర్యుడ్ని వెంటబెట్టుకుని భలే వచ్చావని అంటున్నారట. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఆమెనే స్వయంగా వెల్లడించింది. “నేను నాతో పాటు సూర్యుడ్ని తెచ్చానని వారు అంటున్నారు” అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ఫొటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.






















