రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హరిష్ రావు కామెంట్స్ …
రేణుకా ఎల్లమ్మ ఎత్తి పోతల పథకంతో.. ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ తీరనుంది. సింగూరు నీళ్లతో రేణుక ఎల్లమ్మ పాదాలు కడిగి చెప్పినట్టే మాట నిలబెట్టుకున్నాము. మొత్తం 14 గ్రామాల్లో 3000 ఎకరాలకు సాగు నీటి కొరత తీరుతుంది. సమీపంలోనే సింగూరు జలాశయం ఉన్నా, ఈ ప్రాంతాలు తడిచే పరిస్థితి లేదు. ఇక్కడి ప్రాంతాల రైతులకు చుక్క నీరు అందలేదు. రైతుల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం.. 2017-18 లో తాలెల్మా శివారులో రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం 3 వేల ఎకరాలు, బీడు భూములకు నీరు అందించడం ద్వారా మరో 3, మొత్తం 6 వేల ఎకరాలకు నీరు అందుతుంది.
కేంద్రంలోని బీజేపీ ఒక్క ప్రాజెక్ట్ కు సాయం చేయడం లేదు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ కేసులు వేసి ప్రాజెక్టును అడ్డుకుంటోంది.
కాంగ్రెస్ బిజెపి పార్టీలు తెలంగాణ అభివృద్ధికి నిరోథకంగా తయారయ్యాయి. కర్ణాటకోని ఎగువ భద్రకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చారు. బుందేల్ ఖండ్ లో కెన్ బెత్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. ఏపీో పోలవరానికి ఇచ్చారు.మనం కాళేశ్వరానికో, పాలమూరు ప్రాజెక్టుో అడిగితే మాత్రం కేంద్రం మొండి చేయి చూపింది. మన రాష్ట్ర అభివృద్ధి మనమే చేసుకుంటున్నం. కాంగ్రెస్ హయంలో పెండింగ్ ప్రాజెక్టులుగా ఉన్న ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చుకున్నం. కాళేశ్వరం ప్రాజెక్టు కడతామంటే నవ్వారు… కాదన్నారు.. లేదన్నారు.. కాని అది నిజమయింది. మూడున్నరేళ్లలో మన దేశంలో ఇంత వేగంగా ఏ ప్రాజెక్టును ఏప్రభుత్వం నిర్మించలేదు. కాని ముడున్నరేళ్లలో ప్రపంచలోనే అతి పెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నిర్మించుకున్నాం.
కండ్ల ఎదుట మంజీరా నది పారుతున్నా సాగు, తాగునీటికి ఎన్నో కష్టాలు.. కరువుతో పడావుపడిన భూములు.. ఉపాధిలేక రైతన్నల వలసలు ఇదీ సమైక్య రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా దుస్థితి. పాలకుల నిర్లక్ష్యంతో పూర్తి వివక్షకు గురైన ఈ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చాలని నిర్ణయించారు. సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయడంతో పాటు సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, అందోలు నియోజవకవర్గాల్లోని 3.90లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రూ.4427 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పనులు జరుగుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా నుండి మంత్రులు వచ్చారు. ఉపముఖ్యమంత్రులు ఉన్నారు. కాని ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి కి మాత్రం ఏం చేయలే.. వాళ్లు రాజకీయాలు మాత్రమే చేశారు. ఆంధ్రా సీఎంలకు వంత పాడారు. ఇంతలా మేం అభివృద్ది చేస్తుంటే కాంగ్రెస్- బీజేపీ నేతలు అవాకులు- చెవాకులు మాట్లాడుతున్నారు. కాని బీజేపి ఏం చేస్తుంది. ప్రజలకు ఏది వద్దనుకుంటున్నారో అది చేసి వేధింపులకు గురి చేస్తోంది.
దేశ జీడీపీ పెంచమంటే బీజేపి ప్రభుత్వం గ్యాస్,డీజీల్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుంది. నల్ల ధనం బయటకు వస్తదని చెప్పి…పెద్ద నోట్లు రద్దు చేసి ఇంట్లో ఉండే చిన్న- పెద్ద తేడా లేకుండా ఎంటీఎంల ముందు నిలబెట్టింది. ఎంత నల్ల ధనం తెచ్చారంటే మాత్రం నోరు విప్పరు. రైతులనుండి భూములు లాక్కునేందకు నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చి వాళ్లను రోడ్డు మీదకు తెచ్చారు. లాఠీలతో కొట్టారు.. తూటాలు పెల్చారు. కారుతో తొక్కించిచంపారు… మేం మంచి చట్టాలు తెస్తుంటే ఖలిస్తాన్ తీవ్రవాదులు అడ్డుకుంటున్నరు అని రైతులను అవమానించారు. ఏడాది పాటు జరిగిన రైతు పోరాటంలో 750 మంది దాకా అసువులు బాశారు. చివరకు తప్పయిందంటూ ఆ చట్టాలను వెనక్కు తీసుకున్నారు.
ఇవాళ యువత మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని కోరితే, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నరు. ప్రయివేటు పరం చేస్తున్నరు. 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేయలే. ఇప్పుడు దేశ మిలిటరీని ప్రయివేటు పరం చేస్తున్నరు. ఔట్ సోర్సింగ్ విధానాన్ని సైన్యంలో ప్రవేశపెడుతున్నరు. అంటే ఇక జీతాలు సరిగా ఉండవు, పెన్ష్ న్ ఉండదు… సైనికులకు ఇచ్చే గౌరవం ఉండదు.. ఇదా దేశభక్తులు చేసేది. బిజెపి గాంధీని చంపిన గాడ్సే ను కూడా వీరుడు అంటారు. గాంధీని కించపర్చిన వాళ్ళు బిజెపిలోనే ఉన్నారు.
అగ్ని పథ్ పేరుతో బీజేపీ ఇవాళ దేశంలో అగ్గి రాజేసింది. యువత అశాంతితో ఉడికిపోతున్నారు. వారిని పిలిచి చర్చించాల్సింది పోయి.. కాల్పులు జరిగితే తెలంగాణ యువకుడు అమరుడయ్యాడు. యువతను బీజేపీ రెచ్చగొడ్తుంది. కాల్చుతాం… కేసులు పెడతాం అని బెదిరిస్తోంది. ఇదా పాలన అంటే… దేశానికి సేవ చేసే సైనికులకు ఇస్త్రి, కటింగ్ చెయించడం నేర్పుతామంటున్నడు కిషన్ రెడ్డి సమాధానం ఇవ్వాలి. కాంగ్రెస్ పాలన తెలంగాణకు ఓ పీడకల. అవి నీతి ,ఆకలి చావులు, ఆత్మహత్యలు, ఎన్ కౌంటర్లు. కరెంటు కోతలు, ఎరువుల కొరత, విత్తనాల కొరత, ఎండిపోయిన కాలువలు, పెండింగ్ లో ప్రాజెక్టులు. అలాంటి పార్టీ మన తెలంగాణలో అవసరమా ఆలోచించండి.. తెరాసనే తెలంగాణకు రక్ష. కేసీఆర్ గారే తెలంగాణ చౌకీ దార్. దేశం మన వైపు చూస్తోంది. ఇవాళ మనం ఏం చేస్తే.. రేపు అది చేయడానికి. అలాంటి ప్రభుత్వాన్ని బలపర్చాలి. కాంగ్రెస్- బీజేపీలకు బుద్ది చెప్పాలి.