Butta Bomma Movie : పలు సినిమాల్లో అజిత్ కి కూతురి క్యారెక్టర్స్ లో నటించి.. తెలుగు ప్రేక్షకుల్లో కూడా గుర్తింపు తెచ్చుకుంది “అనిఖా సురేంద్రన్”. కాగా ఇటీవల నాగార్జున హీరోగా వచ్చిన ఘోస్ట్ చిత్రంలో కూడా మెప్పించింది ఈ భామ. ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘బుట్టబొమ్మ’. ఈ మూవీలో అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. శౌరీ చంద్రశేఖర్ టి రమేష్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఒక పల్లెటూరి ప్రేమకథగా ఈ మూవీ తెరకెక్కుతుందని ఇటీవలే రిలీజ్ అయిన ట్రెయిలర్ చూస్తే అర్దం అవుతుంది. అనిఖ సురేంద్రన్ కి ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. ఈ సినిమాను ఈ నెల 26వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. కానీ తాజాగా ఈ సినిమా టీమ్ రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. వచ్చేనెల 14వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం వదిలారు. ఈ టీనేజ్ లవ్ స్టోరీ యూత్ కి ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది చూడాలి. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు ప్రేమకథా చిత్రాలను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే వస్తున్నారు. సరైన కంటెంట్ ఉంటే చాలు .. హిట్ తీసుకొచ్చేసి చేతిలో పెడుతున్నారు. స్టార్స్ తో పని లేకుండా బాక్సాఫీస్ కి భారీ వసూళ్లను అప్పగిస్తున్నారు. అలాంటి ఓ ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి, శౌరీ చంద్రశేఖర్ దర్శకత్వంలో ‘బుట్టబొమ్మ’ రెడీ అవుతోంది.