టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ ప్రారంభం కానుంది. ప్రభాస్ తో సాహో సినిమా తీసిన యువ దర్శకుడు సుజీత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయనున్నాడు. గతంలో సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కింది. తాజాగా పవర్ స్టార్, సుజీత్ కాంబినేషన్ పై డివివి దానయ్య అధికారిక ప్రకటన చేశారు. పవర్ స్టార్ అభిమానుల కోసం ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను కూడా నిర్మాత డివివి దానయ్య విడుదల చేశాడు.
పోస్టర్ లో అతన్ని #OG అని పిలుస్తారని తెలిపారు. అలాగే పోస్టర్ పై చైనా భాషలో ఏదో కోడ్ లాంగ్వేజ్ లో రాసి ఉంది. దీంతో ఈ సినిమా కూడా సాహో లాగే వేరే దేశాల్లో భారీగా ఉండే అవకాశం ఉందని అభిమానులు ఆనందపడుతున్నారు. ఇకపోతే #OG అంటే చాలా మందికి తెలియలేదు. దీని అర్థం ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో మొదటి సారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ గా కనిపించనున్నాడు.
యువ దర్శకుడు సుజీత్ మేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాహోనే హాలీవుడ్ రేంజ్ లో తీయడంతో ఇక పవర్ స్టార్ సినిమాను కూడా అంతకు మించి తీస్తాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేతిలో పలు మూవీస్ ఉన్నాయి.
దర్శకులు క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, సముద్ర ఖని సినిమాలు చేస్తూ పవర్ స్టార్ బిజీగా ఉన్నారు. మరో వైపు రాజకీయ కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారు. అటు పాలిటిక్స్, ఇటు సినిమాలకి టైం అడ్జస్ట్ చేయలేక పవన్ కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇంకో కొత్త సినిమా అది కూడా భారీ బడ్జెట్ గ్యాంగ్‌స్టర్ సినిమా కావడంతో అందరూ ఈ సినిమా 2024లోనే ఉంటుందేమోనని అనుకుంటున్నారు.