నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలలో ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై డా.జగన్ మోహన్ డి వై నిర్మాతగా వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’. బెక్కం వేణుగోపాల్ సమర్పిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 28న థియేటర్లో విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో చాలా గ్రాండ్ గా జరిగింది.
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. కొత్తవాళ్ళు వస్తేనే కొత్త కథలు వస్తాయని నమ్మేవాళ్ళలో నేనూ ఒకడిని. ఆ విధంగానే ఇవ్వాళ ‘అనుకోని ప్రయాణం’అనే కొత్త కథతో నిర్మాత డా.జగన్ మోహన్ డి వై , దర్శకుడు వెంకటేష్ పెదిరెడ్ల వచ్చారు. 45 ఏళ్ల నట జీవితంలో నేను గుర్తుపెట్టుకునే అత్యద్భుతమైన సినిమాల్లో అనుకోని ప్రయాణం ఒకటి. ఈ సినిమాలో అద్భుతమైన ఫన్ వుటుంది.
ఆనలుగురు లాంటి సమాంతర చిత్రాలు ఇండియాలో వందరోజులు ఆడాయి. ఇలాంటి ఎన్నో పరిక్షలు నేను ఎదురుకున్నాను. నా నట జీవితంలో అన్ని రకాల పాత్రలు చేశాను. దీనికి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నరసింహ రాజు గారితో పాటు అన్నీ పాత్రలు గుర్తుంటాయి. ‘అనుకోని ప్రయాణం’ లాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. అప్పుడప్పుడు ఒక అద్భుతంలా వచ్చే కథలివి. 28న సినిమా విడుదలౌతుంది. అద్భుతమైన, అమూల్యమైన అనుభూతిని ఇచ్చే సినిమా ఇది. దయచేసి అందరూ ఫ్యామిలీ తో కలసి థియేటర్లో చూడండి” అని కోరారు.