Anupama Parameswaran : మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుసగా తెలుగు, తమిళ్, మలయాళంలో సినిమాలు చేస్తుంది. తన మళయాళంలో కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తూ ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా వుంటుంది . అలాగే ఎప్పుడు సోషల్ మీడియా లో తను క్యూట్ గా, హాట్ గా ఫొటోలు, వీడియోలు పెడుతూ ఫాలోవర్స్ ని అలరిస్తుంది.
నేడు ఓనమ్ పండుగ. కేరళలో మలయాళీ వాళ్ళు చేసుకునే పెద్ద పండుగలలో ఓనమ్ ఒకటి. ఓనమ్ రోజు కేరళ లేడీస్ అంతా తెలుపు, పట్టు అంచు ఉన్న చీరల్లో మెరిపిస్తారు. ఇప్పటికే అనేకమంది సెలబ్రిటీలు ఓనమ్ స్పెషల్ ఫోటోలను షేర్ చేయగా తాజాగా మన మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ తన ఓనమ్ స్పెషల్ వీడియోని షేర్ చేసింది.
ఈ వీడియోలో అనుపమ తన రింగు రింగుల జుట్టుతో పట్టు అంచు ఉన్న వైట్ శారీ కట్టుకొని తన ఇంటి బయట కూర్చొని మలయాళంలో ఓనమ్ పాట పాడింది. తను క్యూట్ గా పాడిన ఆ వీడియోని పోస్ట్ చేసి అందరికి ఓనమ్ శుభాకాంక్షలు తెలిపింది. అనుపమ పాట పాడటంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక అభిమానులు, నెటిజన్లు ఎంత క్యూట్ గా పడుతుందో అనుపమ అని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే తన స్పెషల్ ఓనమ్ డ్రస్ లో ఎంతో అందం గా వున్నారు అని నెటిజన్లు,అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు .