AP CM Jagan Future Poltical aAalysis Sri Plava Nama Samvastsara Ugadi Panchangam horoscopy, Latest Telugu News, AP News,
శ్రీ ప్లవ నామ సంవత్సరాన జగన్ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
జగన్ జన్మరాశిః మిధున రాశి..
ఆదాయం- 5, వ్యయం- 5
రాజపూజ్యం- 3, అవమానం- 6
ఏపీ సీఎం జగన్ మోహన రెడ్డికి ఈ ఏడాది ఆదాయ- వ్యయాలు సమానంగా ఉండటం.. ఒక శుభ సూచికం. అప్పులు చేయనవసరం లేని పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఒక రకంగా గొప్ప విషయం. ఇక పొగిడే వారికన్నా తెగిడే వారే ఎక్కువగా ఉంటారు ఎప్పటిలాగానే.
అయితే గతంలో జగన్ ని కించ పరిచేవారే తర్వాత కాలంలో గౌరవిస్తారు. పోటీని సమర్ధవంతంగా ఎదుర్కుంటారు. ఒక్కోసారి కొందరు ఉద్యోగులను తీసేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సిబ్బందికి జీతాలు ఆలస్యంగా ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తోంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మొత్తం మీద ఆర్ధిక- వ్యక్తిగత- కుటుంబ వ్యవహారాల్లో మంచి పురోగతి కనిపిస్తోంది. కొన్ని రహస్య ఆస్తిపాస్తులను కొనుగోలు చేసేలా తెలుస్తోంది. చట్ట పరంగా అన్ని తీర్పులు అనుకూలంగా వచ్చేలా కనిపిస్తోంది. సంతాన విషయాలను జగన్ తన జీవిత భాగస్వామి భారతికి అప్పగించడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. సకాలంలో రావల్సిన బిల్లులు అందుతాయి. కరోనా ఎంత కష్టతరంగా సాగుతున్నా.. వాటన్నిటినీ అధిగమించగలరు. ఆర్ధికంగా రొటేషన్ బాగుంటుంది. ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. అయితే మీ పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం.. అంటున్నారు జ్యోతిష- నిపుణులు.
సర్పదోష నివారణ చర్యలు చేపట్టడం ఉత్తమం. మరింత ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. ఇష్టదేవతారాధన మంచిది. ఆంజనేయుడి ప్రీతి చేయడం ఉత్తమం. మేథో దక్షిణామూర్తి ఆరాధన, రుద్రపాశుపత హోమం వంటివి చేయడం మంచిదని చెబుతున్నారు పండితులు.