Crime ఓ ఆర్టీసీ బస్కు పెను ప్రమాదం తప్పింది ఇంజన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సు మొత్తం మంటల్లో దగ్ధం అయిపోయింది.. అయితే డ్రైవర్ అప్రమత్తం అవ్వడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా పులవర్తి గూడెం వద్ద ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.. విజయవాడ నుండి గుడివాడ వెళుతున్న బస్సులో ఇంజన్లో లోపం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులంతా ఉలిక్కిపడ్డారు.. ఈ సమయంలో ప్రయాణికులతో పాటు విద్యార్థులు కూడా ఉన్నారు. మొత్తం 40 మంది ప్రయాణికులు ఇందులో ఉన్నట్టు సమాచారం అయితే ఇందులో ఒక్కసారిగా మంటలు రావటం గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపేశారు. వెంటనే ప్రయాణికులంతా కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది అయితే ఇంజన్ లో సాంకేతిక లోపం వల్లే ఇదంతా జరిగి ఉంటుందని అంటున్నారు అధికారులు.. ఈ విషయంపై స్పందించిన ఆర్టీసీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకుంటామని మళ్లీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటామని అన్నారు.. సమాచారం అందుకున్న అగ్నిమాపకు సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోయినా ఎంతో విలువైన వస్తువులన్నీ మంటల్లో కాలి బూడిద అయిపోయాయని నగదు బంగారం పోయాయని కొందరు ప్రయాణికులు వాపోయారు.. డ్రైవర్ అప్రమత్తమై విషయం తెలియజేయకపోతే ఈ పాటికీ ఏమై ఉండేదో అంటూ కొందరు ప్రయాణికులు డ్రైవర్కు కృతజ్ఞతలు తెలిపారు..