Early morning tea: మనలో చాలా మందికి నిద్ర లేచిన వెంటనే టీ తాగడం అనేది అలవాటు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఇది చాలా మంది దినచర్యలో భాగం అయ్యింది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు అని చెప్పాలి. నిజానికి టీ తాగకుండా రోజును ప్రారంభించినట్లు అయితే కచ్చితంగా ఆ రోజు అంతా వారు ఏదో పోగొట్టుకున్న వారిలో ఉంటారు అని పక్కన ఉన్న వారు చెప్తుంటారు. అయితే నిద్ర లేచిన వెంటనే టీ తీసుకోవడం వలన కొన్ని సమస్యలు తప్పవు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇలా చేయడం కారణంగా భవిష్యత్తు కాలంలో వారు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఉదయం పూట పరగడుపున టీ తీసుకోవడం కారణంగా ఎలాంటి అనారోగ్యం కలుగుతుంది అనేది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పరగడుపున టీ తాగడం కారణంగా మానవుని జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా మన జీర్ణవ్యవస్థ బాగానే పని చేస్తుంటుంది. ఇలా టీ పరగడుపున తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా టీ తాగడం కొనసాగిస్తే సమీప కాలంలో వారు ఎసిడిటీ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు.
అందుకే కాళీ కడుపుతో టీ ని తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అంతేగాకుండా కాళీ కడుపుతో టీ తీసుకోవడం వల్ల కొన్ని ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మార్నింగ్ సమయాల్లో టీ తాగడంతో.. అది స్లో పాయిజన్ లాగ కూడా మారే అవకాశం లేకపోలేదు అని చెప్తున్నారు. ఇలా టీ జీర్ణ క్రియ పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొంటున్నారు.