Crime News : రాచకొండ కమిషనర్ శ్రీ డిఎస్. చౌహాన్ గారి ఆదేశానుసారం, రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, షి టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. రాచకొండ కమిషనరట్ పరిదిలో మహిళలను, యువతులను వేదింపులకు గురిచేస్తున్న 59 మందిని షీ టీమ్స్ అరెస్టు చేసినారు. వారికి శుక్రవారం ఎల్‌బి నగర్ CP Camp office నందు కుటుంబ సబ్యుల సమక్షంలో కౌన్సెల్లింగ్ నిర్వహించడం జరిగింది.
గత నెల 13-05-2023 నుండి 30-06-2023 వరకు ఏకంగా 197 పిర్యాదులు అందినవి శ్రీమతి టి. ఉషారాణి డిసిపి విమెన్ సేఫ్టీ వింగ్ రాచకొండ తెలిపారు. ఫిర్యాదుల పై విచారణ చేపట్టి దర్యాప్తు పూర్తి చేశామన్నారు. అందిన పపిర్యాదులలో ఫోన్ల ద్వారా వేదించినవి -30, WhatsApp కాల్స్ & messages ద్వారా వేదించినవి -40, social media apps ద్వారా వేదించినవి- 20, ఇతర -28 . వాటిలో క్రిమినల్ కేసెస్ -44, పెట్టి కేసెస్ -29, కౌన్సెల్లింగ్ – 45 కాసులు నమోదు చేశామన్నారు. షీ టీమ్స్ వారు స్కూళ్ళు, కాలేజీలు, హాస్టళ్ళు మరియు రద్దీ ప్రదేశాలలో HOT SPOTS ని గుర్తించి మఫ్టీ లో decoy ఆపరేషన్ చేసి స్త్రీలను ఇబ్బంది పెట్టే 106 మంది ఆకతాయిలను గుర్తించారు. అట్టి గుర్తించిన ఆకతాయిలకు కౌన్సెల్లింగ్ నిర్వహించడం జరిగింది. అదేవిదంగా SHE Teams 150 awareness programs ద్వారా 13000 awareness కల్గించడం జరిగింది.
ఛేదించిన కేసులలో కొన్ని..
1.మైనర్ బాలికతో swiggy boy అసభ్యంగా ప్రవర్తించిన ఘటన. ఇందులో ఫిర్యాదుదారు ఉప్పల్ ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. ఆమె పొరుగువారు swiggy ద్వారా ఆర్డర్ బుక్ చేసారు. Swiggy boy డెలివరీ ఇవ్వడం కొరకు వచ్చాడు, లిఫ్ట్ లోబాధిత బాలిక వయస్సు 5 సంవత్సరాలు, అట్టి బాలిక మాత్రమే లిఫ్ట్‌లో ఉంది, ఇదే అదనుగా బావించి ఆమెతో తప్పుగా ప్రవర్తించాడు. దీంతో బాధిత బాలిక తన తల్లిదండ్రులకు సమాచారం అందించింది. వారు SHE Teams ను సంప్రదించగ కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది.
2.జాబ్ పేరుతో మోసం
దీసుఖ్నగర్ హాస్టల్ వుండే అమ్మాయికి , ఆమెకు జాబ్ ఇస్తామని , అన్నీ సర్టిఫికేట్ తీసుకొని , కొన్ని రోజుల తరువాత జాబ్ ఇవ్వకుండా, ఫోన్ ద్వారా వేదించడం చేశాడు. అడిగినన్ని డబ్బులు ఇవ్వాలని లేకపోతే , ఆమె ఫోటోలను nude గా మార్చి సోషల్ మేడియాలో పెడుతనని బెదిరించాడు. దీనితో అమ్మాయి WhatsApp ద్వారా SHE టీమ్ ని సంప్రదించగ , అట్టి వక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది.
Decoy Operation
3.షీటీమ్ మల్కాజిగిరి ఆనంద్ బాగ్ x రోడ్ వద్ద డికాయ్ ఆపరేషన్ నిర్వహించి రోడ్డు మీద వెలుతున్న మహిళను & కాలేజీ గర్ల్స్ ని వెకిలి చేస్తాలతో వేదిస్తున్న 5 మందిని పోకిరిలను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి కౌన్సెల్లింగ్ చేయడం జరిగింది.
ఆడవారికి ఎదురయ్యే భౌతిక పరమైన దాడులు, లైంగిక వేదింపులు, ప్రయాణ సమయాల్లో వేదింపులు వంటి ఇబ్బందుల నుంచి రక్షించేందుకు రాచకొండ పోలీసులు ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు. పురుషులు, సాటి ఆడవారి పట్ల బాధ్యతగా, మర్యాదగా నడుచుకోవాలని, వారికి అండగా నిలవాలని, పలు రకాల అవసరాలతో ఇంటి నుంచి బయటకు వచ్చే స్త్రీలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదన్నారు. స్త్రీలను గౌరవించడం తమ వ్యక్తిత్వంలో భాగం కావాలని, ఆడవారిని ఇబ్బందులు పెట్టే వారిని ఉపేక్షించేది లేదని, అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మహిళలు వేదింపులకు గురి అయినప్పుడు వెంటనే SHE Teams ని , Rachakonda WhatsApp నెంబర్ 8712662111 ద్వారా , లేదా ప్రాంతాల వారిగా Bhongir area- 8712662598, Choutuppal area – 8712662599, Ibrahimpatnam area -8712662600, Kushaiguda area -8712662601, LB Nagar area -8712662602, Malkajgiri area -8712662603 మరియు Vanasthalipuram area -8712662604 నెంబర్ల ద్వారా సంప్రదించాలని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో విమెన్ సేఫ్టీ వింగ్ డిసిపి శ్రీమతి టి. ఉషా రాణి , SHE Teams ACP శ్రీ నరేందర్ గౌడ్, SHE Teams సిబ్బంది పాల్గొన్నారు.