Arshi Skin & Hair Clinic Donated 30Lacks rs Medicines to Basavatarakam Cancer Hospital,Nandamuri Balakrishna,Health News,Covid News,
బసవతారకం క్యాన్సర్ రోగులకు 30లక్షల రూపాయల విలువ కలిగిన మందులను ఉచితంగా అందజేసిన అర్షి స్కిన్ మరియు హెయిర్ క్లినిక్ యాజమాన్యం
హిందుపురం అసెంబ్లీ నియోజక వర్గ ప్రజలకు మరియు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగులకు ముప్పై లక్షల రూపాయల విలువ కలిగిన రోగ నిరోధకతను పెంపొందించే మందులను ఉచితంగా అందజేసిన అర్షి స్కిన్ మరియు హెయిర్ క్లినిక్ యాజమాన్యం….
కోవిడ్ మహమ్మారి రెండవ వేవ్ తో తీవ్ర ఆవేదన ఎదుర్కొంటున్న హిందుపురం అసెంబ్లీ నియోజక వర్గ ప్రజలకు రోగినిరోధకత ను పెంపొందించే మందులను అందించడానికి అర్షి స్కిన్ మరియు హెయిర్ క్లినిక్ యాజమాన్యం వారు ముందుకొచ్చారు. అర్షి స్కిన్ మరియు హెయిర్ క్లినిక్ కు చెందిన డా. వియస్ బి బండి మరియు డా. టి అన్నపూర్ణ గార్లు ఈ మందులను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు.
ఇలా హిందుపురం నియోజక వర్గ ప్రజలతో పాటూ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ తో చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగులు ప్రధానంగా తక్కువ వ్యాధి నిరోథకతో భాదపడుతున్న కోవలోనికి వచ్చే వారున్న నేపధ్యంలో వీరికి కూడా ఈ మందులు అందజేయాలని అర్షి స్కిన్ మరియు హెయిర్ క్లినిక్ యాజమాన్యం తీర్మానించింది.
ఇందుకనుగుణంగానే అర్షి స్కిన్ మరియు హెయిర్ క్లినిక్ యాజమాన్యం కు చెందిన డా. వియస్ బి బండి మరియు డా. టి అన్నపూర్ణ లు ఈ ముప్పై లక్షల విలువ చేసే మందులను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO) డా. ఆర్ వి ప్రభాకరరావు కు అందజేశారు.
ఈ సందర్భంగా డా. వియస్ బి బండి మరియు డా. టి అన్నపూర్ణ, యాజమాన్య సభ్యులు, అర్షి స్కిన్ మరియు హెయిర్ క్లినిక్ వారు మాట్లాడుతూ ఆంద్ర ప్రదేశ్ లోనే మారుమూల ప్రాంతాలలో ఒకటైన హిందుపురం ప్రజలు కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొని నానా ఇక్కట్లు పడుతున్నారని, వీరి భాదలను కొంత మేర తగ్గించి వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి తమ వంతు సాయం చేయాలనే మందులను అందజేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా హిందుపురం ప్రజల సేవకు నిరంతరం కృషి చేస్తున్న శ్రీ నందమూరి బాలకృష్ణ కు చేయూత నందించి తద్వారా ప్రజలను ఆదుకోవాలనేది తమ అభీష్టమని తెలియజేశారు.
మందులను అందుకొన్న సందర్భంగా శ్రీ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ అర్షి స్కిన్ మరియు హెయిర్ కినిక్ కు చెందిన డా. వియస్ బి బండి మరియు డా.అన్నపూర్ణ లు చూపిన దాతృత్వం హిందుపురం ప్రజలతో పాటూ క్యాన్సర్ రోగులను ఎంతో మేలు చేస్తుందని, ఇలాంటి ఉదారత చూపిన వీరికి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. కోవిడ్ పై పోరాటంలో భాగంగా హిందుపురం ప్రజల శ్రేయస్సు కు తీసుకొంటున్న పలు చర్యలలో భాగంగా ఈ మందులను అక్కడి వారికి పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు.
The Management of Arshi Skin & Hair Clinic
donated medicines worth of 30 Lakhs to boost the immunity of people of Hindupuram Assembly Constituency
and cancer patients getting treated in Basavatarakam Indo American Cancer Hospital & Research Institute
As the people of Hindupuram Assembly Constituency in Andhra Pradesh are facing the impact of COVID second wave and looking for support, Dr VSB Bandi & Dr T Annapurna of Arshi Skin & Hair Clinic has come forward to donate immunity boosting medicine for them on the behest of Sri Nandamuri Balakrishna, Chairman Basavatarakam Indo American Cancer Hospital & Research Institute and also MLA, Hindupuram Assembly, Andhra Pradesh.