మన పూర్వీకుల నాటి నుండి జ్యోతిష్యని నమ్ముతుంటాం. ఇల్లు కట్టే దగ్గర నుండి వివాహం వరకు ప్రతి దానిలో జ్యోతిష్యం ఉంటుంది. అయితే మన పేరు ప్రభావాన్ని బట్టి మన జీవితంలో వచ్చే వారిని కూడా తెలుసుకుంటూ ఉంటాం. ఏ అక్షరంతో మొదలైన వారు మన జీవితంలోకి వస్తే ఎలా ఉంటుందో తెలుసుకోండి మరి.
సాధారణంగా ప్రతి ఒక్కరిలో ఒక కుతూహలం ఉంటుంది. మనకు ఇష్టమైన వారి పేర్లు ఎక్కడ ఉన్నా చూసుకుంటూ ఉంటారు. తమ భాగస్వామి తమతో ప్రేమగా, శృంగారం ,నవ్వుతూ ఉండాలని ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు కోరుకుంటూ ఉంటాడు. అయితే ఏ అక్షరంతో మొదలైన వారిని వివాహం చేసుకుంటే తమ వైవాహిక జీవితం బాగుంటుందో అనేది మీరే తెలుసుకోండి మరి.
J అక్షరం :
తమ సంబంధాల గురించి చాలా సీరియస్‌గా ఉంటారు. వారు తమ భాగస్వామిని బాధించరు.. ఇబ్బంది పెట్టరు. చాలా ప్రేమతో ఉంటారు. వారు ఎల్లప్పుడూ తమ జీవిత భాగస్వామిని జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రతి కోరికను నెరవేరుస్తారు. అంతేకాకుండా భాగస్వామి ఏమీ చెప్పకుండానే ప్రతిదీ అర్థం చేసుకుంటారు.భాగస్వామికి చాలా విధేయులుగా.. ప్రేమతో ఉంటారు. రొమాంటిక్‌గా ఉండటంతో పాటు కేరింగ్‌గా కూడా ఉంటారు. మంచి భర్తకు ఉండాల్సిన అన్ని లక్షణాలు వీరికి ఉన్నాయి.
S అక్షరంతో :
S అక్షరంతో ప్రారంభమయ్యే వారు.. వారి ప్రేమ జీవితం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. భార్య లేదా స్నేహితురాలితోపాటు ప్రతి ఒక్కరితో చాలా విధేయులుగా ఉంటారు. వారు ఎల్లప్పుడూ తమ జీవిత భాగస్వామిని చాలా ప్రేమగా చూసుకుంటారు అలానే భార్యను పొందుతారు.
V అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు అతని భార్యను వదిలిపెట్టరు. వారు తమ భాగస్వాములతో స్నేహితులుగా జీవిస్తారు. ప్రతి సుఖంలోను, దుఃఖంలోను వారికి అండగా నిలుస్తారు.