ATA, American Telugu Association, Bhuvaneshwar Bujala, ATA President, Actor Lohith Kumar, CP Sajjanar IPS, Covid News,
COVID NEWS: కోవిడ్ పేషంట్లకు “ఆటా” (ATA) బాసట – అభినందించిన సైబరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మనముందున్న కోవిడ్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మనం ఎంతో మంది కావలసిన వారిని ఆప్తులను కోల్పోతున్నా వార్తలు విన్న భువనేశ్వర్ భుజాల ఆటా అధ్యక్షులు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కాన్ సన్ట్రేటర్స్ ని అందించాలని నిర్ణయం తీసుకొని యుద్ధప్రాతిపదికన వీటిని సమకూర్చుకొని మన రాష్ట్రానికి పంపించడం జరిగింది. ఈ రోజు వీటిని ఇండియా ఆటా టీమ్ ద్వారా సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., గారికి అందజేయడం జరిగింది.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరిస్తూ యాక్టర్ లోహిత్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆక్సిజన్ అవసరం కాబట్టి ఈ ఆక్సిజన్ కాన్సెంట్రేట్ మిషన్స్ 10 మరియు 50 ఆక్సోమీటర్స్ అందజేయడం జరుగుతుందన్నారు. కోవిడ్ పేషంట్ల సహాయార్థం ఇంకా ఎటువంటి అవసరం ఉన్నా సమకూరుస్తామన్నారు. ఈ సందర్భంగా అమెరికాలో ఉంటూ మన వాళ్ల కోసం మన వారి ఆరోగ్య అవసరాలను తీర్చేవిధంగా సహకరిస్తున్న అందర్నీ ప్రత్యేకంగా కమీషనర్ గారు అభినందించారు. ఈ కార్యక్రమములో శ్రీ హనుమంతరావు గారు అసిస్టెంట్ కమిషనర్, ABR tv CEO శ్రీనివాస్ బండారి మరియు రామకృష్ణ మాశెట్టి సంఘ సేవకులు, సీపీ గారి పీ ఏ శ్రీధర్ పాల్గొన్నారు .