Entertainment నటసింహ బాలకృష్ణ.. అటు బుల్లితెర.. ఇటు వెండితెరపై అదరగొట్టేస్తున్నారు. త్వరలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘ఎన్బీకే 107’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద భారీగా టైటిల్ లోగో ఈవెంట్ను నిర్వహించి పేరును ప్రకటించారు. సినిమాకు ‘వీరసింహారెడ్డి’ అని టైటిల్ను ఖరారు చేశారు. కాగా, ఈ ఈవెంట్కు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ తరలివచ్చారు. బాలయ్యపై తమ అభిమానాన్ని చాటుతూ జై బాలయ్య అంటూ రచ్చ రచ్చ చేశారు. సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
కాగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాలయ్యను ఢీకొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో లేడీ పవర్ ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనున్నారు. బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. తమన్ బాణీలు అందిస్తున్నారు. కాగా బాలకృష్ణ అన్స్టాపబుల్ టాక్ షో సీజన్ 2 మొదలైంది.. తనదైన రీతిలో పోస్ట్ చేస్తూ సీజన్ వన్ ఎంత సక్సెస్ఫుల్ చేశారో తెలిసిందే అయితే ఇప్పుడు సీజన్ 2 లో కూడా ప్రముఖ హీరోలతో ముందుకు దూసుకుపోతున్నారు… ఆహాలో స్ట్రీమౌతున్న ఈ ప్రోగ్రాం మంచి ప్రశంసలు అందుకుంటుంది.. ఈ ప్రోగ్రామ్ సీజన్ వన్ ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే అయితే సీజన్ టు మొదటి ఎపిసోడ్ కు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ రాగా ప్రస్తుతం మిగిలిన టాలీవుడ్ స్టార్ హీరోలు దర్శక నిర్మాతలు వస్తున్నారు..