Politics దేశం నుంచి బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికే బాలగంగాధర్ తిలక్ ఆనాడు వినాయక నవరాత్రులని ఏర్పాటు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కులాలు, వర్గాలు, ప్రాంతాల పేరుతో విడిపోయిన హిందూ సమాజాన్ని ఏకం చేయటానికే వినాయక నవరాత్రులు నిర్వహించటం జరుగుతుందని సంజయ్ తెలిపారు.
బండి సంజయ్, తరుణ్గ్ చుగ్ హైదరాబాద్ ఖైరతాబాద్ లో ఉన్న మహాగణపతిని దర్శించుకున్నారు. 20 కేజీల భారీ లడ్డూను వినాయకుడికి సమర్పించి.. నమస్కరించారు.. హిందూ సమాజం చీలిపోతే తెలంగాణకు పెను ప్రమాదం తప్పదని హిందువులంతా ఏకం కావలసిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.. మనతోపాటు సమాజం బావుండాలని కోరుకునే వాడే నిజమైన హిందువు హిందువుగా పుట్టడం పూర్వ జన్మ సుకృతంగా భావించి భగవంతుని నిస్వార్థంగా పూజించాలని అన్నారు. భాజపా జమ్ము కాశ్మీర్ ఇంఛార్జ్ తరుణ్చుగ్తో కలిసి బండి సంజయ్ ఖైరతాబాద్ భారీ గణపతిని దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వారి వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఏకదంతుడికి 110అడుగుల కండువా, 25 కిలోల లడ్డూను భాజపా నేతలు బహుకరించారు.
ఆనాడు బ్రిటిష్ వారిని భారతదేశం నుండి వెళ్లగొట్టడానికి స్వతంత్ర ఉద్యమ నాయకుడు బాలగంగాధర్ తిలక్ వినాయక నవరాత్రులను ప్రారంభించారు. యువకులంతా ఒకే చోట చేరితే బ్రిటిష్ వారు ఒప్పుకునే వారు కాదు.. అందుకే వీళ్ళు ఎక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలో వాళ్లకు తెలిసేది కాదు. ఈ రకంగా వినాయక ఉత్సవాలు ప్రారంభించి.. అందర్నీ ఏకం చేసి స్వతంత్ర ఉద్యమానికి పాటుపడిన గొప్ప నాయకుడు బాలగంగాధర్ తిలక్.


























