Politics గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీ అర్ ఎస్ నాయకుల పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే ఈ నాయకులకు డ్రగ్స్ తో సంబంధం ఉందంటూ ఆరోపించారు అయితే ఈ విషయంపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో సమాధానం ఇవ్వగా విమర్శలు చేసి ఇన్నాలకు అయిన తర్వాత ఇప్పుడు స్పందిస్తే ఏంటి అర్థం అంటూ మరోసారి విరుచుకుపడ్డారు బండి సంజయ్
తాజాగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. బీఆర్ఎస్ నాయకులకు డ్రగ్స్ తో సంబంధం ఉందంటూ ఆరోపణలు చేశారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.. తను ఇప్పటికిప్పుడు అన్ని పరీక్షలకు సిద్ధమేనని.. ఒకవేళ అది అబద్ధమని నిరూపిస్తే ఏం చేస్తారంటూ తిరిగి సవాల్ విసిరారు.. అలాగే తన రక్తం, కిడ్నీ కూడా ఇస్తానని.. ఎన్ని పరీక్షలు చేసినా క్లీన్ చిట్ తో బయటకు వస్తానని అన్నారు.. అంతేకాకుండా ఈ విషయంలో తాను క్లీన్ చిట్ తో బయటకు వచ్చాక బండి సంజయ్ చెప్పుతో కొట్టుకుంటారా అంటూ కూడా సవాల్ విసిరారు.. అయితే ఈ విషయంపై స్పందించారు బండి సంజయ్..
మంత్రి కేటీఆర్ తనపై విసిరిన సవాలకు కౌంటర్ వేశారు బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్.. తాను ఎప్పుడు సవాలు చేశాను? మరి మీరంతా ఎప్పుడు స్పందిస్తున్నారు అంటూ ప్రశ్నించారు.. దొంగలు పడ్డ ఆరు నెలలకు ఇప్పుడు మొరగడం ఎందుకని.. అలాగే కేటీఆర్ విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకున్నారని ఆరోపించారు.. అలాగే ఇప్పుడు దొరకను అనే ధీమా తో కేటీఆర్ ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటూ కూడా చెప్పుకు వచ్చారు..