మెగాఫ్యామిలీతో నిర్మాత బండ్ల గణేష్‌ది విడదీయలేని బంధం. పవన్‌కల్యాణ్ సహా ఆ కుటుంబంలోని నటులపై తనకున్న అభిమానాన్ని ఆయన ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంటారు. ముఖ్యంగా చిరంజీవి, పవన్‌కల్యాణ్‌పై ఒక్కోసారి ఆయన చూపించే వీరవిధేయత అంతా ఇంతా కాదు.
తాజాగా బండ్ల గణేష్ చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. ఆ ట్వీట్‌లో చిరంజీవిని తెగ పొగిడేశాడు బండ్లన్న. చిరు నటిస్తున్న ‘గాడ్‌ఫాదర్’ మూవీలోని ఓ స్టిల్‌ను పోస్ట్ చేశాడు బండ్ల గణేష్. దానితో పాటు చిరంజీవి స్టైల్‌ను పొగుడుతూ కొన్ని వాక్యాలతో తన అభిమాన్ని చాటుకున్నాడు.
‘‘ఇలాంటి స్టైల్ చూసే మీపై ప్రేమ పెంచుకున్నాం. ఆ స్టైల్ చూసే సినిమా రంగం వైపు మేం పరుగులు పెట్టాం. ఆ స్టైల్‌తోనే సినిమా రంగం అనేది ఒకటుంటుందని.. అక్కడ ఏమైనా సాధించవచ్చనే నమ్మకం కలిగింది. అది చూసే ఇక్కడ ఎవరైనా ఏదైనా కావచ్చు అనే నిర్ణయానికి వచ్చేశాం. దానితోనే మీకు ఫ్యాన్స్‌గా మారిపోయాం. ఎప్పటికీ మీరు ఇలాగే స్టైల్‌గా ఉండాలని కోరుకుంటున్నాం’’ అని పేర్కొన్నాడు బండ్లన్న.