Viral Video జంతువులు రకరకాల విన్యాసాలు చేస్తుంటాయి. కొన్నిసార్లు ఇవి చేసే పనులు చూస్తుంటే నవ్వొస్తుంది.. ఇలాంటి వీడియోలు అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా కోతులు, కుక్కలు లాంటి కొన్ని రకాల జంతువులు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఈ జంతువుల చేష్టలు చూసిన జంతు ప్రేమికులు వీటిని పొగుడుతూ.. కామెంట్ చేయకుండా ఉండలేరు. అయితే ఎలుగు బంటి కి సంభందించిన ఇలాంటి ఓ వీడియోనే ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఓ భారీ ఎలుగుబంటి స్తంభం దగ్గర నిల్చోని డాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. దానికి దురద పెట్టిందో ఏమో ఒక పెద్ద స్తంభం దగ్గరకు వచ్చి దాన్ని తాకుతూ బెల్లీ డాన్స్ చేసింది.. దాని నడుమును ఇటూ అటూ ఊపుతూ చేసే డాన్స్ చూస్తే నెటిజనులకు నవ్వు ఆగటం లేదు.
https://twitter.com/buitengebieden/status/1567447986728325120?s=20&t=h6z2iI_xsPr070wQKPH3Eg
ఈ ఎలుగుబంటి వింతలు చూసిన వాళ్ళందరూ వీడియో గురించి ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. సూపర్.. బెల్లీ డాన్స్ చాలా బాగుంది.. కంటిన్యూ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ వీడియోను buitengebieden అనే ట్విటర్ పేజ్ వాళ్ళు షేర్ చేశారు. ఇందులో తరచూ జంతువుల ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పటివరకూ ఈ వీడియోకి 3.6 మిలియన్లకు పైగా వ్యూస్ అంటే దీని ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంది అర్థం చేసుకోవచ్చు.. ఈ ఒక్క వీడియోకే 153k లైక్స్ వచ్చాయి.