Health Tips :ప్రస్తుత కాలంలో హడావుడి జీవితంలో కొనసాగుతూ చర్మంపైన ఆశ్రద్ధ ఎక్కువైపోయింది అనే చెప్పుకోవాలి. ఏదైనా ఫంక్షన్ వస్తే బ్యూటీ పార్లర్ కి వెళ్లడం అధిక మొత్తంలో డబ్బును వృధా చేసుకోవడం జరుగుతుంది. కాసేపు ఎండలో తిరిగితే చాలు చర్మంపై ట్యాన్ అధికమైపోతుంది. ఇంట్లో ఉంటూనే ట్యాన్ తగ్గించేందుకు ఈ చిట్కాలు మీ కొరకే. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.
టమాటాను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అలానే ఎర్ర కందిపప్పును మెత్తగా పొడిలా చేసుకోవాలి ఈ రెండిటి మిశ్రమంలో కాస్త కలబందను కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్లన ముఖంపై ఉన్న ట్యాన్ పోతుంది. చాలామంది పింపుల్స్ తో బాధపడుతూ ఉంటారు. నిమ్మకాయ బద్దతో ముఖానికి మసాజ్ చేసుకుంటే మొటిమల సమస్య నుండి ఉపశమనం పొందుతారు. లేదా మార్కెట్లో దొరికి రోజు వాటర్ రోజు రాత్రి క్లీన్ చేసుకున్న ముఖంపై ఉంది జిడ్డు,ట్యాన్ మటుమాయం అవుతా.
బొప్పాయిలో ఉండే ఎంజైమ్స్ చర్మాని మెరిసేలా చేస్తాయి. పండిపోయిన బొప్పాయి ముక్కలను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ వేసుకున్న మిశ్రమంలో రెండు స్పూన్లు తేనెను వేసుకోవాలి ఆ రెండిటి మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత ముఖానికి అప్లై చేసుకోవాలి ఇలా వారానికి రెండు సార్లు అయినా చేస్తూ ఉంటే చర్మం కాంతివంతంగా మెరవడమే కాక ట్యాన్ కూడా పోతుంది.ఇలా ఇంట్లో ఉండే వాటితో ట్యాన్ పోగొట్టుకోవడం ద్వారా డబ్బులు వృధా అవ్వవు. అలానే ఇటువంటి కెమికల్స్ మన ముఖంపై అప్లై చేసుకొని అక్కర్లేదు. దీనివల్ల చర్మం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది