Health రోజు ఉపయోగించే బెడ్ విషయంలో చాలామంది అజాగ్రత వహిస్తూ ఉంటారు ఎప్పుడో ఒకసారి బెడ్ షీట్లు మార్చడం వంటివి చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దాడి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది..
నిత్యం ఉపయోగించి బెడ్ పైన ఎన్నో హానికర బ్యాక్టీరియా వృద్ధి చెందుతూ ఉంటుందని తాజా అధ్యయనాలు వెలువడింది నిజానికి ఇంట్లో బాత్రూం కంటే బెడ్ పైన ఎక్కువ క్రిములు ఉంటాయని కూడా తెలుస్తుంది ఆశ్చర్యానికి గురిచేసిన ఇదే నిజం..
రోజు నిద్రపోయే బెడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు బెడ్ షీట్లను మారుస్తూ ఉండటం వల్ల ఎన్నో రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు.. అలాగే చాలామంది బెడ్ షీట్లు ఒకసారి మార్చిన తర్వాత మళ్ళీ పూర్తిగా కనిపించేంతవరకు అలానే వదిలేస్తారు కానీ ఇది ఎంత మాత్రం సరైన పద్ధతి కాదు వారానికి ఒక్కసారి అయినా బెడ్ షీట్లను తీసి ఉతుకుతూ ఉండాలి లేదు అంటే హానికర బ్యాక్టీరియా వృద్ధి చెందుతూనే ఉంటుంది.. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవారి ఇంట్లో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం ఎందుకంటే వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది ఎలాంటి అనారోగ్యాలకైనా వెంటనే ప్రభావితం అవుతారు. మన శరీరం నుంచి విడుదలైన లాలాజలం చెమట తల నుంచి విడుదలైన చుండ్రు వంటివి తెల్ల గట్ల పైన బెడ్ షీట్ల పైన పేరుకుపోయి దీర్ఘకాలం వేధించే సమస్యలు నిమోనియా వంటి ఊపరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి..