Health ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాల్లో బెల్లం ఎప్పుడు ముందు వరసలో ఉంటుంది ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే వారిని బెల్లం తరచూ తీసుకోమని చెప్తారు అయితే ఈ బెల్లం తీసుకోవడం వల్ల ఇంకా ఏ ఆరోగ్య ప్రయోజనాలు కరుగుతాయో తెలుసుకుందాం
మహిళల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది అందుకే వీరు తరచూ బెల్లంతో చేసిన ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచిస్తారు వైద్యులు.. అయితే రోజు ఆహారం తినగానే ఒక చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకోవడం వల్ల తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుందని తెలుస్తోంది అంతేకాకుండా బెల్లం మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది అంట అంతేకాకుండా తరచూ దీన్ని తీసుకోవడం వల్ల కాలేయం శుభ్రపడుతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అలాగే ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య తలనొప్పి ఇందులో మైగ్రేన్ చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది అయితే బెల్లాన్ని నెయ్యని సమపాలల్లో తీసుకొని తినటం వల్ల మైగ్రేన్ అదుపులో ఉంటుందని తాజా అధ్యయనాల్లో బయటపడింది.. అలాగే గ్యాస్టిక్ సమస్యతో బాధపడేవారు రోజు ఉదయాన్నే పరగడుపున అల్లం బెల్లం సమపాలల్లో తీసుకొని తినటం వల్ల ఈ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చని తెలుస్తోంది అంతేకాకుండా తరచూ ఆయాసంగా అనిపించినా కొంచెం దూరం నడిచేటప్పటికీ అలసిపోతున్న శరీరంలో ఐరన్ తక్కువైందేమో తెలుసుకోవాలి ఇలాంటివారు ఐరన్ ఎక్కువగా ఉండే బెల్లం వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి అయితే ఎంచుకునే బెల్లం మాత్రం కచ్చితంగా మంచిదే తీసుకోవాలి..