Health news : మనం తీసుకునే ఆహారంలో తగిన పోషక విలువలు లేకపోతే హార్మోన్స్ లోపం విటమిన్స్ లోపం వంటి సమస్యలు అధికమవుతాయి. తీసుకునే ఆహారంలో పోషక విలువలు అధికంగా ఉండేలా తీసుకుంటే అనారోగ్య సమస్యలకు స్వస్తి చెప్పవచ్చు. అయితే చాలామంది నత్తలు పీతలు వంటి పోషక ఆహారాలను తినడంలో కాస్త మొహమాటం పడతారనే చెప్పుకోవాలి. కానీ పీతలు ఉండే పోషక విలువలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. పీతలను తినడం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయా తెలుసుకుందాం.
ఒక కప్పు వండిన పీతల్లో ఉండే పోషక విలువలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. పీతను తినడం ద్వారా
97 కేలరీలు 21 గ్రాముల ప్రోటీన్ మరియు 1 గ్రాము కంటే తక్కువ కొవ్వు, కార్బోహైడ్రేట్లు ఫైబర్ల సంఖ్య పీతల శూన్యంగా ఉంటుంది. పీతలు తినడం ద్వారా కండరాల నిర్మాణానికి ఎంతగానో తోడ్పడతాయి. అలానే గుండెపోటు సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు పీతలో ఉండే ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
అలానే మెదడు పనితీరు చురుగ్గా అయ్యేలా చేస్తుంది. మరి ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధి బాధపడే వారికి పీతలను తమ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అల్జీమర్స్ వ్యాధి నుంచి ఉపసదన పొందుతారు.. అయితే పీతల వివిధ రకాలు ఉన్నాయి. మనకు లభించే పీతల్లో మాంసకృతులు తక్కువగా ఉంటాయి. సముద్ర పీతలు తీసుకోవడం ద్వారా అధిక మాంసకృతులను పొందవచ్చు. అలానే బ్రౌన్ పీతలను ఎక్కువగా తీసుకోరాదని వాటిలో అధిక మోతాదులో తీసుకుంటే విషపూరితమే అని వైద్యులు సూచిస్తున్నారు.