Health Tips : ప్రస్తుత కాలంలో చిన్న వారి నుంచి పెద్దవారి వరకు కిడ్నీ రాళ్లు సమస్యలతో అధికముగా బాధపడుతున్నారు. మారుతున్న కాలానుసారం వివిధ రకాల ఆహారానికి అలవాటు పడటం ద్వారా ఈ సమస్య అధికమవుతుంది .కాస్త మనం తీసుకునే ఆహారపు నియమాలు మార్చుకుంటే ఇటువంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.అయితే ఈ సమస్య చిన్న వారిలో అధికంగా కనిపిస్తుంది అని కొన్ని అధ్యయనాల్లో కూడా తేలింది అయితే కిడ్నీలో రాళ్లు గుర్తించే లక్షణాలు మీకొరకు తెలుసుకోండి మరి.
కిడ్నీలో రాళ్లు మూడు రకాలుగా చెప్పవచ్చు అవి కాల్షియం రాళ్ళు,స్ట్రువైట్ రాళ్ళు,యూరిక్ యాసిడ్ రాళ్లు వంటి కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి అయితే సాధారణంగా ఈ సమస్యను ముందు గా గుర్తించ లేరు అయితే కిడ్నీ రాళ్లు సమస్యతో బాధపడే వారిలో పక్కటెముకల కింద వైపు, వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి కడుపు, గజ్జలు కు వ్యాపించే నొప్పి మూత్ర విసర్జన సమయంలో నొప్పి అలాగే మూత్రంలో రంగు మార్పు వికారం, వాంతులుకూడిన జ్వరం, చలి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచిది.
ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఆపరేషన్ వంటివి దూరం చేసుకోవచ్చు,అధికముగా నీటిని తీసుకోవడం, టమాటా పాలకూర మాంసకృత్తులు వంటివి తీసుకోకపోవడం మంచిది. ప్రోటీన్ కొరకు బీన్స్ తీసుకోవడం మంచిది ఒక కప్పు వండిన బీన్స్ లో 15 – 20 గ్రాముల వరకు ప్రొటీన్ లభిస్తుంది.బీన్స్‌లో ఫోలేట్, ఐరన్, ఫాస్ఫరస్, మ్యాంగనీస్ కూడా ఉంటాయి వీటితో పాటుఆకుకూరలు వంటివి అధికంగా తీసుకోవడం ద్వారా కిడ్నీలో రాళ్లు కరిగించుకోవచ్చు అని నిపుణలు చూచిస్తూత్నరు