మీ రోజువారీ ఆహారంలో గుడ్డు ఉండేట్లు చూసుకుంటున్నారా? బరువు విషయంలో చికెన్‌తో పాటు గుడ్లు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే గుడ్డును ఎలా తినాలి? ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది? ఎగ్ వల్ల లాభాలేంటి? అనే విషయాలను ఓసారి పరిశీలిస్తే.
పోషకాలను గుడ్లు స్టోర్ హౌస్ లాంటిది. ముఖ్యంగా ప్రొటీన్లు, ఇతర పోషక పదార్థాలు అందులో పుష్కలంగా ఉంటాయి. ఒక గుడ్డులో 75 కేలరీలు, 7 గ్రాముల ప్రొటీన్, 5 గ్రాముల కొవ్వు, ఐరన్, విటమిన్లు లభిస్తాయి. గుడ్డు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే అతిగా తింటే బరువు పెరగడం.. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. గుడ్డులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చిన్నపిల్లలకు రోజూ ఒక గుడ్డు పెడితే వారి ఎదుగుదలకు, ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలైనా, పెద్దవాళ్లయినా ఉడికించిన ఎగ్ తింటే మరింత ప్రయోజనం కలుగుతుంది.


























